https://oktelugu.com/

అచ్చెన్న దూకుడుకు లోకేష్‌ బ్రేకులు

గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన శాఖలో జరిగిన అవినీతిపై ఇటీవల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా.. ఆయనకు టీడీపీ అధినేత ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు.. తన బాబును యాక్టివ్‌ రాజకీయాల్లోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ ఇటీవల జనంలోకి వెళ్లి ప్రశ్నిస్తుండడమే ఇందుకు కారణం. మరిన్ని ఆంధ్ర రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 12:58 pm
    Follow us on

    chenna naidu nara lokesh

    గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన శాఖలో జరిగిన అవినీతిపై ఇటీవల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా.. ఆయనకు టీడీపీ అధినేత ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు.. తన బాబును యాక్టివ్‌ రాజకీయాల్లోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ ఇటీవల జనంలోకి వెళ్లి ప్రశ్నిస్తుండడమే ఇందుకు కారణం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    టీడీపీలో రోజురోజుకూ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు, టీడీపీ భావి అధ్యక్షుడిగా భావించే నారా లోకేష్‌ ఉన్నట్టుండి దూకుడు పెంచారు. పార్టీ అధికారం కోల్పోయి 16నెలలు గడిచినా మొన్నటివరకు లోకేష్‌ సైలెంట్‌గానే ఉండిపోయారు. అదేంటో ఉన్నట్టుండి ఆయన స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు. మరి లోకేష్‌ ఇలా ఎందుకు దూకుడు పెంచాడనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    Also Read: ముద్రగడ ఎందుకు సైలెంట్‌ అయ్యారు..!

    వాయుగుండం ప్రభావంతో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు చాలా జిల్లాలు వ‌ర‌ద ముంపులో చిక్కుకున్నాయి. ఇప్పుడు లోకేష్ ఆయా జిల్లాల్లో ప‌ర్యటిస్తున్నారు. ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. అయితే.. ఊర‌క‌రారు మ‌హానుభావులు అంటారు కదా.. లోకేష్‌ కూడా అనూహ్యంగా తెరమీదకు రావడం వెనుక ఏదైనా ప్లాన్‌ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యూహం లేకుండానే చినబాబు అడుగులు వేయరనేది రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అంటున్నారు.

    Also Read: అక్రమాస్తుల కేసు: జగన్‌ వర్గంలో తీవ్ర ఉత్కంఠ

    ఇందులో ప‌రామ‌ర్శల కోణం కంటే మ‌రో కోణం కూడా ఉంద‌న్న చ‌ర్చలు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మొన్నటివ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఇంటి గ‌డ‌ప‌ను కూడా దాట‌ని లోకేష్‌.. అనూహ్యంగా ఏపీపై ఇంత ప్రేమ రావ‌డం వెనుక‌ త‌న‌కు న‌చ్చని నాయ‌కుడికి త‌న తండ్రి చంద్రబాబు ప‌ద‌విని అప్పగించ‌డ‌మేన‌ని అంటున్నారు. అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పజెప్పడం లోకేష్‌కు ఇష్టం లేదట. ఆయ‌న ఎవ‌రి మాటా విన‌ర‌ని, ముఖ్యంగా తాను ఏది సూచించినా.. పెద్దాయ‌న‌కు చెప్పాల‌ని అనేవార‌ని.. దీంతో త‌న హ‌వాకు బ్రేకులు వేస్తున్నార‌నే ఆలోచ‌న ఆది నుంచి చినబాబులో గూడుక‌ట్టుకుంది. దీంతో ఈ ప‌ద‌వికి నెల్లూరుకు చెందిన బీద ర‌విచంద్రకు ఇప్పించుకునేందుకు లోకేష్ శ‌త‌విధాలా ప్రయ‌త్నించారు. అయితే.. చంద్రబాబు మాత్రం అచ్చెన్నాయుడుకు ఈ ప‌ద‌విని క‌ట్టబెట్టడంతో అచ్చెన్న హవా కొనసాగకుండా చినబాబే నేరుగా రంగంలోకి దిగారనేది ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఆయన ఎక్కడికి వెళ్లిన కూడా అచ్చెన్నను ఆహ్వానించడం లేదట. ముఖ్యంగా అచ్చెన్న దూకుడుకు బ్రేకులు వేసేందుకు లోకేష్‌ ఈ రాజకీయం చేస్తున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.