ఈ మాత్రం దానికి ఉద్యోగ సంఘాలతో భేటీ ఎందుకో..?

ఉద్యోగ సంఘాలు అంటే.. ఉద్యోగులకు అండగా ఉండాలి. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. లేదంటే పోరాడాలి. కానీ.. ఏపీలో మాత్రం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో అంటకాగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే.. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. Also Read: నష్టపోయాం, మీరే చెప్పారు.. : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. జీపీఎఫ్ కింద తాము పొదుపు చేసుకున్న […]

Written By: Srinivas, Updated On : February 20, 2021 4:37 pm
Follow us on


ఉద్యోగ సంఘాలు అంటే.. ఉద్యోగులకు అండగా ఉండాలి. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. లేదంటే పోరాడాలి. కానీ.. ఏపీలో మాత్రం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో అంటకాగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే.. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: నష్టపోయాం, మీరే చెప్పారు.. : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. జీపీఎఫ్ కింద తాము పొదుపు చేసుకున్న సొమ్ములు రావడానికి ఆలస్యం అవుతున్నాయి. రిటైరైన బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరిలో వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి తీవ్రమైన ఒత్తిడి వచ్చే సరికి చర్చిద్దామంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులను ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీఎం తర్వాత సీఎం బాధ్యతలు నిర్వహించే సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించారు. అయితే.. ఆ సమయంలో జరిగింది మాత్రం ఉద్యోగుల కష్టాల గురించి కాదు. తమ ఉద్యోగ సంఘాల గురించే. వైసీపీ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘం నేతగా వెలిగిపోతున్న వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి అనే ఉద్యోగ సంఘాల నేతలతో పాటు మరికొంత మంది సమావేశాలకు హాజరయ్యారు.

ఇంతవరకూ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణాలేమిటో వారు మొదటగా ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టలేకపోయారు. రిటైరైన వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమవుతోందో ప్రశ్నించలేదు. కానీ.. ఒక శాఖకు ఒక ఉద్యోగ సంఘమే ఉండాలన్న ఓ ఉద్యోగ సంఘ నేత ప్రతిపాదన చేయడంతో రచ్చ రచ్చ చేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉంటాయన్నది తర్వాతి విషయం. ముందుగా సమావేశ అజెండా ఉద్యోగుల కష్టాలను తీర్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం.

Also Read: మోడీ సార్.. పైసా విదిల్చడు.. ప్రసంగాలు చేస్తాడు

చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి వారికి సర్ది చెప్పి సమావేశం మమ అనిపించారు. అయితే.. సమావేశం అజెండాలోని అంశాల గురించి ఏమీ చెప్పకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ.. సీఎంఎఫ్ ఎస్‌ విధానం వల్ల సమస్యలు వస్తున్నాయని పరిష్కరిస్తామని చెప్పి పంపారు. అసలు ఏ టార్గెట్‌తో అయితే.. ఏ సమస్యల పరిష్కారానికైతే సమావేశానికి ఉద్యోగ సంఘాలు వెళ్లాయో అసలు విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా సమస్యల మళ్లీ అలాగే మిగిలిపోయాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్