https://oktelugu.com/

న్యాయవాద దంపతుల హత్యపై సంచలన ప్రకటన చేసిన పుట్టమధు

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య వెనుక తాను ఉన్నానని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై తొలి సారి స్పందించాడు పెద్ద పల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఈ టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పారిపోలేదని.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నానని.. ఈ హత్యపై పోలీసుల విచారణ అనంతరం హైదరాబాద్ లో అన్ని ఆధారాలతో మీడియాతో మాట్లాడుతానని పుట్ట మధు సంచలన ప్రకటన చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2021 / 04:24 PM IST
    Follow us on

    హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య వెనుక తాను ఉన్నానని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై తొలి సారి స్పందించాడు పెద్ద పల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఈ టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పారిపోలేదని.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నానని.. ఈ హత్యపై పోలీసుల విచారణ అనంతరం హైదరాబాద్ లో అన్ని ఆధారాలతో మీడియాతో మాట్లాడుతానని పుట్ట మధు సంచలన ప్రకటన చేశారు.

    తనను కేసులో ఇరికించడం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఉన్నాడని పుట్ట మధు ఆరోపించాడు. .పోలీసులను విచారణ చేయనిస్తారా? లేక శ్రీధర్ బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు తొత్తుగా మారి అమ్ముడుపోయిన కొన్ని మీడియా సంస్థలు , టీవీ చానెళ్లు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పుట్టమధు మండిపడ్డారు. ఆ మీడియా సంస్థలే తనను లోపలికి పంపడానికి ప్రయత్నిస్తున్నామని నిప్పుులు చెరిగారు. నా కుటుంబం,నాపై ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదని పుట్ట మధు వాపోయారు.

    నేను మోసగాడిని కాదని.. నేను, నా కుటుంబం ప్రజల కోసమే జీవితాలను అంకితం చేశామని పుట్ట మధు అన్నారు ఒక బీసీ జడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేకనే తనపై విష ప్రచారం చేస్తున్నారని తప్పు పట్టారు.

    ఇక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తాను కలిసి లాబీయింగ్ చేస్తున్నానన్న వార్తలను పుట్ట మధు ఖండించారు. తాను కేసీఆర్, కేటీఆర్ అపాయింట్ మెంట్లు అడగలేదని స్పష్టం చేశారు. నేను ఎవరికోసం ఎదురుచూడలేదని.. హత్య జరిగినరోజు నుంచి ఇవాళ్లి వరకు మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. పోలీసులు చేయాల్సిన దర్యాప్తును మీడియా సంస్థలే చేస్తున్నట్లుగా ఉందన్నారు. పోలీసు విచారణ తర్వాత తాను అన్ని విషయాలు చెబుతానని పుట్ట మధు సంచలన ప్రకటన చేశారు.