https://oktelugu.com/

మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

హైకోర్టు అనుమతివ్వడమే ఆలస్యం.. తెలంగాణ సర్కార్ వెంటనే రాత్రికి రాత్రి అందరూ పడుకున్నాక సచివాలయాన్ని కూలగొట్టడం మొదలుపెట్టింది. అలా ఎందుకు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయంగా మారింది. జీ బ్లాక్ కింద గుప్త నిధుల కోసం అలా చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లాంటి వారు ఆరోపిస్తుంటారు. అయితే మీడియాను కూడా ఈ కూలగొట్టే చోటకు అనుమతులు ఇవ్వలేదు కేసీఆర్ సర్కార్. మీడియా అంటే ఏ వార్ జోన్ లోకైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని.. ఎందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2020 / 06:09 PM IST
    Follow us on


    హైకోర్టు అనుమతివ్వడమే ఆలస్యం.. తెలంగాణ సర్కార్ వెంటనే రాత్రికి రాత్రి అందరూ పడుకున్నాక సచివాలయాన్ని కూలగొట్టడం మొదలుపెట్టింది. అలా ఎందుకు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయంగా మారింది. జీ బ్లాక్ కింద గుప్త నిధుల కోసం అలా చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లాంటి వారు ఆరోపిస్తుంటారు. అయితే మీడియాను కూడా ఈ కూలగొట్టే చోటకు అనుమతులు ఇవ్వలేదు కేసీఆర్ సర్కార్. మీడియా అంటే ఏ వార్ జోన్ లోకైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని.. ఎందుకు అనుమతించరని తాజాగా కేసీఆర్ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.

    Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

    తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ కూల్చివేతలో కనీసం ఫొటోలు తీయడానికి కూడా అనుమతించకపోవడంపై మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చారిత్రాత్మక జీ బ్లాక్ నిర్మాణాలను కూల్చివేసిన సమయంలోనూ ఫొటోలు తీయకుండా నిలువరించింది. మీడియాను ఆ చోటకు ప్రవేశించకుండా నిషేధించింది.

    ఇక ఈ కూల్చివేతకు వచ్చిన కూలీలు.. బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుళ్లను కూడా ఈ ఫొటోలు క్లిక్ మనిపించడానికి ప్రభుత్వం అనుమతించలేదు. కొంతమంది డేరింగ్ జర్నలిస్టులు.. సచివాలయం చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కి ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఏ మీడియా జర్నలిస్టులను , వ్యక్తులను సచివాలయ భవనాల కూల్చివేతను తీసేందుకు అనుమతించవద్దని భవన యజమానులను పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు బెదిరించినట్టు సమాచారం.

    Also Read: కేసీఆర్ పై ఆర్కే మౌనం.. రామోజీ ఎటాక్

    ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులు తమను అనుమతించకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. మీడియాను అనుమతించాలని.. భవన యజమానులను వేధించవద్దని కోరింది.

    నిజానికి ప్రభుత్వం మీడియాను చూసి ఎందుకు భయపడుతుందో.. ఎందుకు నిరోధించడానికి ప్రయత్నిస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైట్ హౌస్ ను తలదన్నేలా నిర్మిస్తున్న ఒక కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం కేసీఆర్ ఇన్ని ఆంక్షలు పెట్టడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. మీడియాను చూసి కేసీఆర్ భయం వెనుక ఏదో మర్మం ఉందని జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.