https://oktelugu.com/

గెటప్‌ మార్చేసి.. మాస్‌ ట్రాక్‌లోకి నాగశౌర్య

చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జ్యో అచ్యుతానంద, చలో, ఓ బేబీ.. రీసెంట్‌గా అశ్వథ్థామ. యువ కథానాయకుడు నాగశౌర్య ఖాతాలో మంచి విజయాలే ఉన్నాయి. మంచి హైట్‌, ఫిజిక్ ఉంది. యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, కెరీర్ను మలుపు తిప్పే సక్సెస్‌ మాత్రం రావడం లేదు. ఇన్ని సినిమాలు చేసినా ఇంకా లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడి లుక్‌లోనే కనిపిస్తున్నాడు శౌర్య. తానే స్టోరీ అందించిన ‘అశ్వథ్థామ’తో ఆ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 06:26 PM IST
    Follow us on


    చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జ్యో అచ్యుతానంద, చలో, ఓ బేబీ.. రీసెంట్‌గా అశ్వథ్థామ. యువ కథానాయకుడు నాగశౌర్య ఖాతాలో మంచి విజయాలే ఉన్నాయి. మంచి హైట్‌, ఫిజిక్ ఉంది. యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, కెరీర్ను మలుపు తిప్పే సక్సెస్‌ మాత్రం రావడం లేదు. ఇన్ని సినిమాలు చేసినా ఇంకా లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడి లుక్‌లోనే కనిపిస్తున్నాడు శౌర్య. తానే స్టోరీ అందించిన ‘అశ్వథ్థామ’తో ఆ ముద్ర చెరిపేసుకొనే ప్రయత్నం చేసి కొంత సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు పూర్తిగా మాస్‌ ట్రాక్‌లోకి వస్తున్నాడు.

    Also Read: పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !

    సుమంత్‌, ఈషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా సుబ్రమణ్యపురం మూవీ తీసిన సంతోష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో నాగశౌర్య ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అతని సరసన ‘రొమాంటిక్‌’ మూవీ ఫేమ్‌ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ప్రీ లుక్‌ను చిత్ర బృందం ఈ రోజు (శనివారం) రిలీజ్‌ చేసింది. హీరో నాగ శౌర్య వెనక్కి తిరిగి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో కండలు తిరిగిన దేహంతో ఉన్న శౌర్య గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో అతను పూర్తిగా మాస్‌ లుక్‌లోకి వచ్చేశాడు. అశ్వథ్థామ టైమ్‌లో బాడీ పెంచిన శౌర్య ఈ మూవీ కోసం స్పోర్ట్స్‌ పర్సన్‌లా మేకోవర్ అయ్యాడు. సిక్స్‌ లేదా ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో కనిపించబోతున్నాడు.

    Also Read: తెలుగు వెబ్‌ సిరీస్‌లా.. అయితే ఓ కండీషన్.. సమంత!

    నాగశౌర్యకు ఇది 20వ చిత్రం. ఇది మన ప్రాచీన క్రీడ ఆర్చరీ చుట్టూ అల్లిన కథ అని తెలుస్తోంది. ప్రీ లుక్‌ పోస్టర్ పై ది గేమ్‌ నెవర్ బి ద సేమ్‌ (ఆట ఇక మునుపటిలా ఉండబోదు) అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రతిభావంతుడైన ఓ ఆర్చర్ అనేక అడ్డంకులను దాటి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడనేదే కథ అని సమాచారం. సినిమాకు ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. మూవీ ఫస్ట్‌ లుక్‌ ను సోమవార (ఈ నెల 27న) రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. నారాయణ్‌ దాస్‌, రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్త నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ప్రీ లుక్‌ పోస్టర్ను శౌర్య సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వైరల్‌గా మారింది.