దుబ్బాకలో గెలిచి.. జీహెచ్ఎంసీలో తొడగొట్టిన బీజేపీపై కొద్దిరోజుల కిందట తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విరుచుకుపడ్డారు. సరిగ్గా ఒక నెల క్రితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ఫోరమ్ ను మళ్లీ పునరుద్ధరించబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Also Read: వరంగల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్..!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి డిసెంబర్ రెండవ వారంలో హైదరాబాద్‌లో దేశంలోని అన్ని బిజెపి వ్యతిరేక రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించనున్నట్లు కేసిఆర్ ప్రకటించి బీజేపీకి సవాల్ విసిరారు.
వ్యవసాయంపై కఠినమైన చట్టాలను బీజేపీ రూపొందించడం, ఎల్‌ఐసి, ఎయిర్ ఇండియా, బొగ్గు గనులు, రైల్వేలు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం.., పెద్ద పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికి అనేక పిఎస్‌యులను మూసివేయాలని నిర్ణయించిన మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ అప్పుడు విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓరకంగా మోడీపై కేసీఆర్ పెద్ద యుద్ధమే చేశాడు..
కానీ జిహెచ్‌ఎంసి ఎన్నికలలో టిఆర్‌ఎస్ పేలవ ప్రదర్శన తర్వాత కేసీఆర్ త్వరగా ట్యూన్ మార్చడం రాజకీయవర్గాలను సైతం ఆశ్యర్యపరిచింది. ఫలితాలు ప్రకటించిన వారంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ ప్రభుత్వానికి స్నేహపూర్వక హస్తం అందించారు. తన మూడు రోజుల పర్యటనలో ఆయన ప్రధాని, హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. కాని కెసిఆర్ గట్టిగా వ్యతిరేకించిన అదే చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసే ప్రయత్నం అస్సలు చేయలేదు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత.. టీఆర్ఎస్ చీఫ్ హైదరాబాద్లో బిజెపి వ్యతిరేక పార్టీల సమావేశాన్ని నిర్వహించాలనే తన ప్రణాళిక గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఇతర ప్రాంతీయ పార్టీల అధిపతులను పిలిచే ప్రయత్నం కూడా చేయలేదు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సమయంలో, ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఆమెకు మద్దతునిచ్చారు. కానీ కేసిఆర్ అలాంటి ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: సీనియార్టీ కాదు.. పార్టీని బతికించే వాడే కావాలి..!
ఇదే విషయాన్ని తాజాగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం తన ట్వీట్‌లో ఎత్తి చూపడం విశేషం.. ‘ఐపీఎస్ అధికారుల బదిలీ సమస్యపై బెంగాల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు మమతా తాజాగా నలుగురు సీఎంలు, స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు.. కెప్టెన్ అమరీందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, భూపేష్ బాగెల్ మరియు అశోక్ గెహ్లోట్ లకు మమత కృతజ్ఞతలు తెలిపారు.. అయితే ఫెడరల్ ఫ్రంట్ చీఫ్ అని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను మమత ఎందుకు గుర్తు చేయలేదు. కేసీఆర్ ఆమెకు ఎందుకు మద్దతు ప్రకటించలేదు’ అని కొండా విశ్వేశ్వరరెడ్డి ట్వీట్ చేశారు..
“కేసీఆర్ బిజెపికి భయపడ్డాడు. సానుభూతి కోరుతూ ఢిల్లీకి వెళ్లాడు.. కెసిఆర్ మమతకు మద్దతు ఇచ్చారా? అతని ఫెడరల్ ఫ్రంట్ కు ఏమి జరిగింది? అకస్మాత్తుగా నాడిని కోల్పోయింది. ఎందుకు? ” అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.
వాస్తవానికి.. బెంగాల్ సీఎం మమతా త్వరలోనే కోల్‌కతాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆమె బిజెపి వ్యతిరేక నాయకులందరినీ ఆహ్వానించింది కానీ కెసిఆర్ ను పిలవకపోవడం విశేషం.
“మమతా బెనర్జీ ఎప్పుడూ కేసీఆర్ ను విశ్వసించలేదు.. గౌరవించలేదు. శరద్ పవార్ జీ అతన్ని నమ్మడు. స్టాలిన్.. పట్నాయక్ జి అతన్ని విశ్వసించడం లేదు.. గౌరవించడం లేదు, ”అని కొండా ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపి కొండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. “మమతా ఆఫీషియల్ గా కెసిఆర్‌ను ఎప్పుడూ నమ్మలేదు. నిజం ఏమిటంటే బిజెపి & టిఆర్ఎస్ పరస్పర అవగాహనలో ఉన్నాయి. వారి లక్ష్యం ప్రజలను మూర్ఖులను చేయడమే. మీరు ఈ ఉచ్చులో ఎప్పుడూ పడరని నేను నమ్ముతున్నాను, కాబట్టి కాంగ్రెస్ తో మాత్రమే ఉండండి, ఎందుకంటే మీరు దేనినైనా విశ్వసించే పార్టీ అంటే అది కాంగ్రెస్ నే ” అని కొండా సెటైర్లు వేశారు.
దీన్ని బట్టి కేసీఆర్ తెరవెనుక బీజేపీతో దోస్తీ నిర్వహిస్తున్నారని.. పరిస్థితులు తలకిందులైతే స్నేహం.. బాగుంటే తోకజాడిస్తున్నాడని.. అందుకే కేసీఆర్ కు జాతీయ స్థాయిలో విశ్వసనీయత లేదనే విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ బయటపెట్టారు. మరి ఇది నిజమేనా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
-నరేశ్
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Why kcr dropped plan to hold anti bjp meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com