
స్ధిర వ్యవసాయానికి నూతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. పర్యావరరణ హితం, స్ధిర వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు.ప్రస్తుతం ఈ అంశం రైతులకు సవాల్‌గా మారిందన్నారు. దీనిని అధిగమించడానికి వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. సోమవారం న్యూఢిల్లీకి చెందిన అగ్రికల్చరల్ సైంటిఫిక్ తమిళ్‌సొసైటీ వారు నిర్వహించిన 6వ జాతీయ అగ్రికల్చరల్ సైంటిఫిక్ సదస్సును గవర్నర్ తమిళిసై వర్చువల్ విధానంలో ప్రారంభించారు.