కేసీఆర్, జగన్ ఎందుకు మాట్లాడుకోవడం లేదు

తెలుగు ప్రాంతాల్లో జల వివాదం కొనసాగుతోంది. ఒకప్పుడు ఇద్దరు కలిసి మెలసి ఉన్నముఖ్యమంత్రులు ప్రస్తుతం ఎడమెహం పెడమెహంలా ఉంటున్నారు. దీంతో గొడవ తీవ్ర స్థాయికి చేరుతోంది. మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు, ఏపీ నాయకులు తమ పరస్పర దూషణలతో పెద్ద దుమారమే రేగుతోంది. సున్నితమైన అంశాన్ని వివాదాస్పద విషయంగా చేస్తూ చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయే సమస్యను సుడిగాలిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇద్దరు పరస్పరం […]

Written By: Srinivas, Updated On : July 9, 2021 3:54 pm
Follow us on

తెలుగు ప్రాంతాల్లో జల వివాదం కొనసాగుతోంది. ఒకప్పుడు ఇద్దరు కలిసి మెలసి ఉన్నముఖ్యమంత్రులు ప్రస్తుతం ఎడమెహం పెడమెహంలా ఉంటున్నారు. దీంతో గొడవ తీవ్ర స్థాయికి చేరుతోంది. మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు, ఏపీ నాయకులు తమ పరస్పర దూషణలతో పెద్ద దుమారమే రేగుతోంది. సున్నితమైన అంశాన్ని వివాదాస్పద విషయంగా చేస్తూ చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయే సమస్యను సుడిగాలిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికలకు ముందు ఇద్దరు పరస్పరం ఒకరికొకరు పిలుచుకుంటూ స్నేహ హస్తం అందించినా ప్రస్తుతం ఏమైందని పలువురు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా జరిగితే తెలంగాణలో ఫిర్యాదు చేసుకునే స్నేహితులుగా ఉన్న నాయకులు ఇప్పుడు ఎందుకు విరోధుల్లా మారారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు కలిసి దావత్ లు చేసుకుని ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్న నేతలిద్దరు పలకరింపులకు కూడా వెనుకాడడం ఎందుకో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ విజయం సాధించగానే ప్రధాన మంత్రి కంటే ముందు కేసీఆర్ ను కలిశారు. తరువాత రెండు సార్లు ప్రగతి భవన్ కు వెళ్లి సమావేశమయ్యారు. అంతలా కలిసిపోయిన సీఎంలు ఉన్నట్టుండి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును హైదరాబాద్ లోనే ఇక్కడి పోలీసుల సహకారంతోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. కారణాలు ఏమిటో తెలియదు. మొదటి విడత లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న హాస్టల్ విద్యార్థుల్ని ఏపీ సర్కారు సరిహద్దుల్లోనే నిలిపివేసింది. దీంతో తెలంగాణ సర్కారు మళ్లీ హాస్టళ్లకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.

రెండు ప్రాంతాల మధ్య ఏ సమస్యవచ్చినా మాట్లాడుకుంటే సరిపోతుంది. అంబులెన్స్ లను తెలంగాణ సర్కారు నిలిపివేసినప్పుడు కూడా కేసీఆర్ తో మాట్లాడడానికి జగన్ ఇష్టపడలేదు. ప్రస్తుతం వివాదం వచ్చినా ఇరువురు ముఖ్యమంత్రులు ముఖాముఖి మాట్లాడుకోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఉమ్మడి ప్రాజెక్టుగా తెలంగాణ భూభాగంలో ఓ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన చేసినా ఒప్పందాలు చేసుకోవాలని జగన్ కూడా సిద్ధమయ్యారు.

వివాదాల విషయంలో జగన్ కాస్త వెనక్కి తగ్గినా కేసీఆర్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు చెడిపోయేలా ఉన్నాయి. రాజకీయమో, లేక వ్యూహమో తెలియడం లేదు. మళ్లీ ఉమ్మడి శత్రువు వారిని ఏకం చేస్తుందా అన్నదే తెలియాలి. రెండు ప్రాంతాల మధ్య పలకరింపులులేవు. ఇరువురు కలిసి మాట్టాడుకుంటే తీరిపోయే సమస్యను పెద్దది చేస్తున్నారని చెబుతున్నారు.