వైసీపీ సైలెంట్‌గా ఎందుకు సైడ్‌ అయినట్లు..?

గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో ఇప్పుడు యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌లా మారాయి. ఒక్కో పార్టీ తర్వాత అన్ని పార్టీలూ పోటీకి సై అంటున్నాయి. హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే.. ఇప్పటికే జనసేన, టీడీపీలు కూడా పోటీలు నిలుస్తున్నాయి. కానీ.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఎందుకో సైలెంట్‌ అయి సైడ్‌ అయిపోయింది. ఏకంగా గ్రేటర్‌‌లో పోటీ చేయడం లేదని అధికారిక ప్రకటన చేసేసింది. Also Read: చేతులు […]

Written By: NARESH, Updated On : November 20, 2020 11:53 am
Follow us on


గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో ఇప్పుడు యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌లా మారాయి. ఒక్కో పార్టీ తర్వాత అన్ని పార్టీలూ పోటీకి సై అంటున్నాయి. హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే.. ఇప్పటికే జనసేన, టీడీపీలు కూడా పోటీలు నిలుస్తున్నాయి. కానీ.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఎందుకో సైలెంట్‌ అయి సైడ్‌ అయిపోయింది. ఏకంగా గ్రేటర్‌‌లో పోటీ చేయడం లేదని అధికారిక ప్రకటన చేసేసింది.

Also Read: చేతులు కాలాక.. పవన్ ఆకులు పట్టుకున్నాడా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధకారికంగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు సాధించి బలమైన పార్టీగా ఉన్న వైసీపీ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పౌరులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో పోటీ చేయడానికి వెనుకాడడం చర్చకు దారి తీసింది.

ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి.. సంపూర్ణ మెజార్టీతో ఉన్న పార్టీనే హైదరాబాద్‌లో పోటీ చేసేందుకు వెనుకాడడంపై నెటిజన్లు పరేషాన్‌ అవుతున్నారు. అంటే.. భవిష్యత్తులో కూడా తెలంగాణలో పార్టీ పోటీ చేయకపోవచ్చని, ఒకరకంగా హైదరాబాద్‌లో వైకాపా బిచాణా ఎత్తేసినట్లేనని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు.. క్షేత్రాలు, ఏర్పాట్లు ఇవీ!

వైసీపీ గ్రేటర్‌‌లో పోటీ చేయకపోవడం ఏంటనే అనుమానాలు వస్తున్నాయి ప్రజల్లోనూ. కేసీఆర్‌‌తో ఉన్న అనుబంధంతోనే ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారా..? ఇప్పుడు ఈ ఇరు సీఎంల మధ్య బంధం కొంత బెడిసికొట్టినట్లేనని వార్తలు వచ్చాయి. జల వివాదంలో భాగంగా ఇద్దరి మధ్య వైరం పెరిగిందట. మరి ఈ క్రమంలో వైసీపీ గ్రేటర్‌‌ బరిలో నిలవచ్చు కదా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్