‘కుడిదిలో పడ్డ ఎలుక’లాగా తయారైంది జనసేన పరిస్థితి. సినిమాల్లో సీనియర్ నటుడుగా ఎన్నో సక్సెస్ లు సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మాత్రం ప్రతీసారి ఫెయిలవుతున్నారు.. తెలిసో.. తెలియకో.. పవన్ చేస్తున్న ప్రకటనలతో పార్టీలోని నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ‘వండిన కూరను తినడానికి వచ్చినట్లు’ తెలంగాణలోని బీజేపీని అంతకుముందు పట్టించుకోని పవన్ దుబ్బాక ఎన్నిక తరువాత కమలంలతో పొత్తు అని ప్రకటించాడు. అయితే బీజేపీ మాత్రం పవన్ ను పట్టించుకోవడం లేదు.
Also Read: నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు.. క్షేత్రాలు, ఏర్పాట్లు ఇవీ!
దుబ్బాకలో ఇటీవల జరిగిన ఎన్నికలో బీజేపీ గెలుపొందింది. దీంతో అప్పటి వరకు కనిపించని పవన్ ఆ తరువాత బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. బీజేపీ నాయకులు కష్టపడి విజయాన్ని సొంతం చేసుకున్నారన్నారు. అయితే గతంలో కేసీఆర్ తో మీటింగ్ పెట్టిన జనసేన అధినేత ఇప్పడు బీజేపీ నాయకులను పొగడడంతో టీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదే తరుణంలో హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే జనసేన కూడా తాము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జి ప్రకటించాడు. బీజేపీతో పొత్తు విషయం కూడా ఆలోచిస్తామని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు బండి సంజయ్ జనసేనతో పొత్తు ఉండదని తెలిపాడు.
Also Read: కేసీఆర్ తో గేమ్స్ ఆడకు.. ఫ్యామిలీ మొత్తాన్ని దించేశాడు!
దీంతో జనసేన పరిస్థతి అయోమయంగా మారింది. బీజేపీతో పొత్తు ఉంటే ఒకటో, రెండో సీట్లు కొట్టుకోవచ్చని అనుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పక్కా హామీ లేకుండా జనసేనను ప్రజలు ఆదరిస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే దుబ్బాక ఎన్నిక సమయంలో బీజేపీ నాయకులను పవన్ పొగిడినా అది అంతకుముందు మద్దతు ఇస్తే బాగుండునని, గెలిచిన తరువాత పొత్తు అనడం ఏమాత్రం బాగోలేదని ఆ పార్టీలోని కొందరు నాయకులు వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన అధినేత ఇప్పడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్