Vijayawada: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లోని విజయవాడ ఒక ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడి వాతావరాణానికి అలవాటుపడ్డవారు బెజవాడని నేను ఒక్క నగరంగా మాత్రమే చూడరు. కృష్ణా డెల్టా సంస్కృతికి ఒక చిహ్నం. ఇంకా చెప్పాలి అంటే కోస్తా సంస్కృతికి ప్రతిరూపం. ఎన్నో రంగాలలో రాణించిన వ్యక్తుల ఈ జిల్లాకు సొంతం. ఆధునిక తెలుగు సంస్కృతికి ఆలవాలం. ఇక్కడున్న ప్రకాశం బారేజ్, ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్ కాలువను ఎంత దూరం వెళ్తుందా అని చూస్తూ ఉండిపోవాల్సిందే.. భగ భగ మండుటెండను సైతం లెక్క చేయకుండా.
విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. ‘‘బ్లేజ్’’ అంటే మండటం. మండేవాడ అని అర్థం అన్నమాట. అంత ఎండలోను విజయవాడవాసులు వేడి వేడి టీని తాగుతారు, సిగరెట్లు, బీడీలను మండించగలరు..వేడి వేడి బోండాలు, పునుగులు, మిరపకాయ బజ్జీలు తినగలరు. బహుశా వేడికి వేడి తోడయితే ఉష్ణం ఉష్ణేణ శీతలం అనేలా పనిచేస్తుందేమో. అంతటి ఎండలోనూ ఇక్కడి దుర్గమ్మను కనులారా వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూనే ఉంటారు. భక్తి ముందుకు ఎండ వేడిమి కూడా దిగదుడుపే.
ప్రస్తుత ఎండాకాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉన్నా, చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సిటీ బస్సులు ఎక్కేవారు, దిగేవారు ఎండలో తిరుగుతూ పెద్దగా నీరసించిపోరు. విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే కనిపించడం విశేషం. బండలు పగిలే మండు వేసవి, ఒళ్లు కాలి వేడెక్కే వేసవి, వేడిగాల్పులు, ఒక మోస్తరు వేసవి, మామూలు వేసవి, వేసవి కాని వేసవి అని ఆరు రుతువులు ఇక్కడున్న వారు అనుభవిస్తారు. విజయవాడ కంటే నిప్పుల కొలిమే నయం అనిపించడానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి.
అయితే, విజయవాడ నగర వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. కాలుష్యం బాగా పెరిగిపోయింది. గాలిలో కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది. ప్రజల రాకపోకలు బాగా పెరిగాయి. చిన్న చిన్న సమస్యలకే అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం లేదా గొంతులో అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కనిపించినట్లయితే బయట గడిపే సమయాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యధిక దిగువ స్థాయి ఓజోన్ వలన ప్రస్తుత శ్వాస సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి వేసవిలో జాగ్రత్తగా మసులుకోవాలని చెబుతున్నారు.