Homeఎంటర్టైన్మెంట్Jr NTR : ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినోడు జూ ఎన్టీఆర్

Jr NTR : ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినోడు జూ ఎన్టీఆర్

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి వంశంలో మూడో తరం నట వారసుడు. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారక్ మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. అతడి పాపులారిటీ, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ స్థాయికి చేరింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్. మంచి ఆహార్యం, వాగ్ధాటితో ఎక్కడైనా దూసుకెళ్లే తత్వం ఆయన సొంతం. అనర్గళంగా తెలుగు భాషను మాట్లాడగలరు. ఇటీవల అమెరిన్ ఇంగ్లీష్ లో సైతం ఇరగదీశారు. అయితే ఒక్క భాషే కాదు. ఆయన వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో.. తెలిసినోడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే అంత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు తారక్ ఒక్క విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. తాతగారి శతజయంతి వేడుకలకు హాజరు విషయంలో డిఫెన్స్ ను ఎదుర్కొంటున్నారు. నెల 20న హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దాదాపు నందమూరి వంశమంతా ఆ రోజు ఒకే వేదికపైకి రానుంది. అంతటి మహత్తర కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఇప్పుడు కార్యక్రమానికి వెళతారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో పాటు టీడీపీతో తారక్ కు గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది. ఆ కారణంగానే తారక్ హాజరుపై ఎక్కువ మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి అదే రోజు తారక్ ముందస్తుగా కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. అదేరోజు అతని పుట్టిన రోజు కావడంతో దగ్గరగా ఉండే 20 కుటుంబాలతో కలిసి మాల్దీవులు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు తాత శతజయంతి వేడుకలకు ఆహ్వానం అందడంతో ఏంచేయాలో తారక్ కు పాలుపోవడం లేదు. కుటుంబసభ్యులంతా వచ్చి.. తాను రాకపోతే ఎటువంటి విమర్శలు వస్తాయోని ఆందోళన చెందుతున్నారు. హాజరైతే చంద్రబాబు పొలిటికల్ అడ్వంటేజ్ చేసుకోని వాడుకుంటారన్న భయం ఉందట. అందుకే తారక్ అచీతూచీ వ్యవహరిస్తున్నారు.
అయితే తారక్ మాత్రం వీలైనంత వరకూ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ గా తారక్ ఎదుగుతున్నారు. తన చుట్టూ ఎన్నోరకాలుగా రాజకీయాలు వచ్చినా పెద్దగా వెరడం లేదు. ఆసక్తి చూపడం లేదు. మొన్నటికి మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలిశారు. రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. కానీ తారక్ మాత్రం ఎక్కడా గాభరా పడకుండా జాగ్రత్తగా డీల్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం సమయస్ఫూర్తిగా మాట్లాడారు. ఇప్పుడు తాత శతజయంతి వేడుకలకు హాజరవుతారని.. చంద్రబాబుతో సఖ్యత ప్రదర్శించే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఎక్కడ ఎలా ప్రవర్శించాలో తెలుసునని చెబుతున్నారు.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version