Homeఆంధ్రప్రదేశ్‌Naga Babu North Andhra Tour: నాగబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎందుకు? జనసేన ప్లాన్ ఏంటి?

Naga Babu North Andhra Tour: నాగబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎందుకు? జనసేన ప్లాన్ ఏంటి?

Naga Babu North Andhra Tour: జనసేన ఆవిర్భవించి దాదాపు దశాబ్ద కాలం సమీపిస్తోంది. కానీ రాజకీయంగా కుదురుకోలేదు. ఇతర రాజకీయ పక్షాల్లా అధికారం కోసం అర్రులు చాచలేదు. కానీ రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంది. గణనీయంగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ప్రత్యామ్నాయ శక్తిగా మారింది. కానీ అభిమానించి, ఆదరించే ఓటర్లను సంఘటితం, సమన్వయం చేసుకోలేకపోవడం ఆ పార్టీకి మైనస్. పవన్ కళ్యాణ్ కు అటు సినిమా వ్రుత్తికాగా.. రాజకీయం ప్రవ్రుత్తి కావడంతో రెండు నావల మీద ప్రయాణం చేయడంతో పార్టీ బలోపేతం చేయడంలో వెనుకబడ్డారన్న అపవాదు ఉంది. ఇటువంటి సమయంలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అండగా నిలవాల్సిన అవసరముంది.

Naga Babu North Andhra Tour
pawan kalyan, Naga Babu

గడిచిన ఎన్నికల ప్రచారానికి మెగా కాంపౌండ్ నుంచి కథానాయకులు వచ్చినా.. ఎన్నికల తరువాత సైలెంట్ అయిపోయారు. తాజాగా జనసేనలో నాగబాబు యాక్టివ్ అవుతున్నారు. ఆయన ఉత్తరాంద్ర బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలు అంత చురుగ్గా సాగడం లేదు. పవన్ సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంటున్నారు. నాదెండ్ల మనోహర్ ఒక్కడే అన్నీతానై బాధ్యతలు చూసుకుంటున్నారు. మిగతా పార్టీలకు నియోజకవర్గ, జిల్లా, ప్రాంతీయ బాధ్యులు ఉన్నారు. జనసేన విషయానికి వచ్చే సరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ కారణంగా పార్టీ వ్యవహారాలు స్లో అయ్యాయి. నియోజకవర్గాల్లో జనసైనికులు కాస్తంత పోరాడుతున్నా నాయకత్వ సహకారం, సమన్వయం లేకపోవడంతో లెక్కలోకి రావడంలేదు. అందుకే పార్టీకి మంచి ఆదరణ ఉన్న ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని నాగబాబు భావిస్తున్నారు.

Also Read: Financial Crisis Telangana: తెలంగాణలో ఆర్థిక సంక్షోభం.. జీతాలకూ కష్టమే.. నెల గడవాలంటే ఎన్ని వేల కోట్లు కావాలంటే?

ప్రతిష్టాత్మకం..
గత అనుభవాల ద్రుష్ట్యా 2024 ఎన్నికలను పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తిచేసి ఎన్నికలకు సన్నద్ధం కానున్నారు. పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. అంతవరకూ పార్టీ సమన్వయ బాధ్యతలను నాదేండ్ల మనోహర్ తో పాటు నాగబాబుకు అప్పగించారు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటివరకూ నాగబాబు పార్టీ కోసం ప్రత్యేకంగా పని చేసిందీ లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన యాక్టివ్ కావడం చర్చనీయాంశమైంది. పైగా ఇటీవల అభిమానుల సమావేశాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని…పొత్తుల విషయంలో పవన్ ఆలోచలను ప్రభావితం చేసేలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇమేజ్ ఉంది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతీ మాట పదునైనదే. అధికార పక్షానికి ఉలికిపాటుకు గురిచేసిందే. ఆయన బదులు పార్టీ సమన్వయం చేసుకునేందుకు ముందుకొస్తున్న నాగబాబు అచీతూచీ మాట్లాడాల్సి ఉంటుంది. అనవసర వ్యాఖ్యలు కంటే నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరముంది.

ఆ వర్గాలను దరి చేర్చుకుంటే..
జిల్లాల పునర్విభజనతో ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి. సామాజికపరంగా తూర్పుకాపులు అధికం. ఆ తరువాత స్థానాల్లో వెలమలు, మత్స్యకారులు, కాళింగులు ఉన్నారు. ఇందులో తూర్పుకాపులు, మత్స్యకారుల్లో పవన్ కు మంచి ఓటు బ్యాంకు ఉంది. వాటిని పదిలం చేసుకోవడంతో పాటు మరింత పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిన అవసరముంది. గడిచిన ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసిన చాలా మంది అభ్యర్థులు సైలెంట్ అయిపోయారు. కొందరు అధికార పార్టీల్లోకి జంప్ అయ్యారు. అటువంటి నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులను నియమించాల్సిన అవసరముంది. అదే సమయంలో బూత్ లెవల్ లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Naga Babu North Andhra Tour
Naga Babu

భారతీయ జనతా పార్టీ ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి బూత్ లెవల్ లో సంస్థాగత బలమే కారణం. జనసేన బలమైన రాజకీయ పక్షంగా మారుతున్న తరుణంలో సంస్థాగత నిర్మాణంపై ద్రుష్టిపెట్టాలి. పార్టీ అనుబంధ విభాగాల కార్యవర్గాలను ఏర్పాటుచేసి వారికి నిర్థిష్టమైన బాధ్యతలు అప్పగించాలి. ఇప్పటికే కౌలురైతుల ఆత్మహత్యలు, ఆయా కుటుంబాలకు నగదు సాయం అందించి రైతు కుటుంబాలకు జనసేన దగ్గరైంది. నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు భరోసా నిచ్చేలా కార్యక్రమాలు నిర్వహించింది. వారి అభిమానాన్నైతే చూరగొంది.. కానీ దానిని ఓట్ల రూపంలో మార్చుకోవాల్సిన గురుతర బాధ్యత అధి నాయకత్వంపై ఉంది. ఉత్తరాంధ్రలో దాదాపు 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించే స్థితో మత్స్యకారులు ఉన్నారు. అందుకే వారిపై నాగబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. మత్స్యకార నాయకులతో చర్చించి వారిలో భరోసా కల్పిస్తే మత్స్యకారులు జనసేనకు చేరువయ్యే అవకాశం ఉంది. నాగబాబు టూర్ వెనుక ఈ అజెండా ఉందని జన సైనికులు చెబుతున్నారు. అయితే నాగబాబును పార్టీ క్యాడర్ ఎంత సీరియస్‌గా పట్టించుకుంటారన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు పార్టీలో ఏ పదవీ లేదు.

Also Read:Kaleswaram Is Closing: కాళేశ్వరం మూసివేత తప్పదా?.. ఈ పరిస్థితి ఎందుకు?

Recommended Videos:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular