Russia Ukraine War: ఎటు చూసినా ఉక్రెయిన్ యుద్ధం గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచమే నివ్వెరపోతోంది. రష్యా సైనిక చర్యలను ఖండిస్తున్నా ఆ దేశం దురాక్రమణ మాత్రం ఆపడం లేదు. దీంతో యావత్ దేశాలు ఆక్షేపిస్తున్నాయి. రష్యా దురాగాతాలు ఆపాలని సూచిస్తున్నాయి. ఉక్రెయిన్ చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నాయి. పసికూన ఉక్రెయిన్ ను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీంతో అమెరికా లాంటి అగ్ర దేశం కూడా రష్యా యుద్ధాన్ని ఖండిస్తోంది. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా రష్యా మాత్రం పెడచెవిన పెడుతోంది.

ఇంతకీ ఉక్రెయిన్ చేసిన తప్పిదమేంటి? దానిపై యుద్ధానికి కాలు దువ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకీ ఆక్రమణకు రష్యా ప్రయత్నిస్తోంది? అని అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తోంది. ఆధునిక కాలంలో యుద్ధం అంటేనే అందరు భయపడుతుంటే రష్యా మాత్రం యథేచ్ఛగా యుద్ధానికి కాలు దువ్వడం దాని అహంకారానికే నిదర్శనంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దమనకాండను అందరు నిరసిస్తున్నారు. పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతు పలుకుతున్నా ప్రత్యక్షంగా రష్యాను మాత్రం ఏమీ అనడం లేదు. దీంతో ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏకాకిగా మిగులుతోందా?
మరో వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రష్యా సేనలను ఎదుర్కొంటామని సవాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధని కీవూ లో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నిత్యం విమానాల రొదలు వినిపిస్తున్నాయి. బాంబుల వర్షం కలవరపెడుతోంది. శాంతి ఒప్పందాలను తోసిరాజని పుతిన్ యుద్ధ సన్నాహాలు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
తూర్పు ప్రాంతాల్లో సైనికులను దింపి ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకు గాను యుద్ధ సామగ్రి తరలించి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. చిన్న దేశం అని చూడకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎటు చూసిన శబ్దాలతో దద్దరిల్లుతోంది. అయినా పుతిన్ మాత్రం తన చర్యలను ఆపడం లేదు. ఫలితంగా ఉక్రెయిన్ పలు విభాగాల్లో సమస్యల్లో చిక్కుకుంటోంది.

ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది. ఇది పుతిన్ కు నచ్చలేదు. వారితో స్నేహపూర్వకంగా ఉండొద్దని పలుమార్లు ఉక్రెయిన్ కు హెచ్చరికలు జారీ చేసినా అధ్యక్షుడు పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన పుతిన్ ఉక్రెయిన్ ను తుదముట్టించాలనే పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాంతో యుద్ధమే శరణ్యమని భావించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం యుద్ధం కొనసాగిస్తోంది.
అయితే రష్యా విచ్చిన్నం కావద్దనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్ ను తమ దేశంలో కలుపుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడటం అంటే సాహసమే. ఎందుకంటే అప్పుడే విడిపోకుండా చూడాల్సిందిపోయి ఇప్పుడు వాటిని ఏకం చేయాలని చూడటం సరైంది కాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. ఏదిఏమైనా రష్యా చర్యలతో ప్రపంచమే నివ్వెరపోతోంది. రష్యా సైనిక చర్యలను ఆపాలని అభ్యర్థనలు వచ్చినా లెక్కచేయకుండా యుద్ధానికే సిద్ధం కావడం తెలిసిందే.
Also Read: ఉక్రెయిన్ కు ఊతమిచ్చే దేశాలేవి? రష్యాకు భయపడేనా?
[…] […]