అదిరేటి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అతడు మళ్లీ సేఫ్..

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియల్టీ షో ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిన్నటితో బిగ్ బాస్ నాలుగో సీజన్ 8వారాన్ని పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతోంది. 8వ వారం చివరి రోజును యథావిధిగా హోస్టు నాగార్జున కంటెస్టులతో ఆటలు ఆడించి ఎలిమినేషన్ పూర్తి చేశారు. అయితే చివర్లో ఎవరూ ఊహించని విధంగా ట్వీస్ట్ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేశాడు. Also Read: సుధీర్.. రష్మీల బంధాన్ని లీక్ చేసిన గెటప్ శ్రీను..! మ్యూజిక్ గేమ్.. ఒకరినొకరు […]

Written By: NARESH, Updated On : November 2, 2020 12:36 pm
Follow us on


బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియల్టీ షో ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిన్నటితో బిగ్ బాస్ నాలుగో సీజన్ 8వారాన్ని పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతోంది. 8వ వారం చివరి రోజును యథావిధిగా హోస్టు నాగార్జున కంటెస్టులతో ఆటలు ఆడించి ఎలిమినేషన్ పూర్తి చేశారు. అయితే చివర్లో ఎవరూ ఊహించని విధంగా ట్వీస్ట్ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేశాడు.

Also Read: సుధీర్.. రష్మీల బంధాన్ని లీక్ చేసిన గెటప్ శ్రీను..!

మ్యూజిక్ గేమ్.. ఒకరినొకరు అనుకరణ చేసుకోవడం వంటి గేమ్స్ ను బిగ్ బాస్ కంటెస్టులచే ఆడించాడు. మ్యూజిక్ గేమ్ రికార్డు డాన్స్ తరహాలో సాగగా.. అనుకరణ హౌస్ లో నవ్వులు పూయించింది. ఇదిలా ఉండగా ఎలిమినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టుల్లో మొనాల్.. అరియానా.. లాస్యలు సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. శనివారం అఖిల్ సేవ్ అయ్యాడు. దీంతో మిగతా ఇద్దరిలో టెన్షన్ నెలకొంది.

ఎలిమినేషన్లో అమ్మ రాజశేఖర్.. మోహబూబ్ మిగిలిపోయారు. దీంతో ఇంటి సభ్యులతో నాగార్జున మాట్లాడుతూ హౌస్ లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదని అడుగగా ఆరుగురు సభ్యులు అమ్మరాజశేఖర్ కు వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు మోహబూబ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక ఓటింగులోనూ అమ్మ రాజశేఖర్ కు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అతడు ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు.

Also Read: వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆ వెంటనే మోహబూబ్ సేఫ్ అని అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అందరికీ విడ్కోలు పలికిరా అంటూ నాగార్జున సూచించడంతో ఇంటిలోకి వెళ్లాడు. అమ్మ రాజశేఖర్ తన సూట్ కేసు పట్టుకొని వస్తుండగా నువ్వు సేఫ్ అంటూ ప్రకటించాడు. దీంతో అందరూ ఖంగుతిన్నాడు. నోయల్ ఇంటి నుంచి వెళుతూ ఈ వారం ఎవరినీ ఎలిమినేషన్ చేయద్దని బిగ్ బాస్ ను కోరినట్లు క్లారిటీ ఇచ్చాడు.

అయితే అమ్మ రాజశేఖర్ మాత్రం తనను ఇంటి నుంచి పంపించాలని కోరడంతో నాగార్జున అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ వారం అందరికీ కంటే తక్కువ ఓట్లు నీకే వచ్చినందునా నిన్నే కెప్టెన్సీ కోసం నేరుగా నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో రాజశేఖర్ ఎలిమినేషన్ తప్పించుకొని ఏకంగా కెప్టెన్ గా నిలిచాడు. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్వీస్ట్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. 9వ వారం అమ్మ రాజశేఖర్ కు  కెప్టెన్సీ దక్కడంతో ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్