https://oktelugu.com/

జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి ఎందుకు పోవడం లేదు..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదో ఒక కారణం చేత హైకోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. హైకోర్టు నుంచి ప్రతీసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో కొందరు చిన్న చిన్న సమస్యలపై నేరుగా కోర్టునే ఆశ్రయిస్తున్నారు. దీంతో అనవసర విషయాలతో కోర్టు సమయం వృథా అవుతోందని ప్రభుత్వ వర్గాలు వాపోతున్నాయి. అయితే కేసు ఏదైనా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టే విధంగా రావడం వైసీపీ నాయకుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై కోర్టు ప్రభుత్వాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 09:13 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏదో ఒక కారణం చేత హైకోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. హైకోర్టు నుంచి ప్రతీసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో కొందరు చిన్న చిన్న సమస్యలపై నేరుగా కోర్టునే ఆశ్రయిస్తున్నారు. దీంతో అనవసర విషయాలతో కోర్టు సమయం వృథా అవుతోందని ప్రభుత్వ వర్గాలు వాపోతున్నాయి. అయితే కేసు ఏదైనా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టే విధంగా రావడం వైసీపీ నాయకుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది.

    Also Read: జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి ఎందుకు పోవడం లేదు..?

    గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుహ్యంగా ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కోర్టును సంప్రదించినా చివరకు నిమ్మగడ్డదే పై చేయి అయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే కరోనా వ్యాప్తి కూడా పెరిగింది.

    ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుతున్నా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. ఒకవైపు కరోనా.. మరోవైపు కోర్టు నుంచి వచ్చే చీవాట్లతో ప్రజల్లోకి వెళితే ఏమవుతుందోననే ఆందోళనలో జగన్‌ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓ వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశాడు. దీంతో ఎన్నికలపై కోర్టు ప్రభుత్వాన్ని నిలదీయగా కరోనా వ్యాప్తి కారణం చెప్పింది. అయితే ఇతర రాష్ట్రాల్లో నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహిస్తున్నారుగా..? అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోయింది.

    Also Read: హైదరాబాదీలు.. తస్మాత్‌ జాగ్రత్త

    జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రచారం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని అనుకుంది. కానీ ఈ పథకాలు ఏదో ఒక కారణంతో నిలిచిపోవడం.. కోర్టులో ఎదురు దెబ్బలు.. కరోనా ప్రభంజనంతో ప్రస్తుతం ఎన్నికల జోలికి వెళితే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందేమోనని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొందరు ప్రతిపక్షాల నాయకులు మాత్రం తాము గెలవలేకనే ఎన్నికల జోలికి వెళ్లడం లేదని రెచ్చగొట్టడం కామన్‌ అయిపోయింది. మరి జగన్‌ కరోనా నిబంధనలు పాటించైనా ఎన్నికలు నిర్వహిస్తాడా.. కొంతకాలం పరిస్థితి సద్దుమణిగాక ప్రజల్లోకి వెళ్తాడా..? అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.