సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే నెలలో జరగనుంది. ఈ ఎన్నిక టీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధానంగా మాత్రం టీఆర్‌ఎస్ బీజేపీ మధ్యనే పోరు ఉందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండగా బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డిలో పోటీ పడుతున్నారు. అయితే ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ ప్రచారంలో ముందున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి ఎందుకు పోవడం లేదు..?
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి, సోలిపేట రామలింగరెడ్డిలు ఒకే పార్టీలో ఉండడంతో అప్పుడు టీఆర్‌ఎస్‌కు బలం ఉండేది. అయితే ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి బంగపడి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. చెరుకు ముత్యంరెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉంది. దీంతో ఈ పేరు శ్రీనివాసరెడ్డికి లాభిస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు ముత్యంరెడ్డితోనే సోలిపేటకు బలం ఉండేదని, ఇప్పుడు ఆయన బయటకు రావడంతో టీఆర్‌ఎస్ ఓట్లు చీలినట్లయిందని బీజేపీ అభ్యర్థి రఘునందర్‌రావు ప్రచారం చేస్తున్నాడు.
Also Read: హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. భిక్కుభిక్కుమంటున్న జనం