Homeజాతీయ వార్తలుModi Respectful Gesture: హాట్ టాపిక్: మోడీ వరల్డ్ కప్ ట్రోఫీని ఎందుకు తాకలేదు..?

Modi Respectful Gesture: హాట్ టాపిక్: మోడీ వరల్డ్ కప్ ట్రోఫీని ఎందుకు తాకలేదు..?

Modi Respectful Gesture: మన పిల్లలు ఏదైనా బహుమతి గెలిచి ఇంటికి వస్తే మురిసిపోతాం.. ముద్దాడతాం. ట్రోఫీతో పొటోలు దిగుతాం. ఇక దేశానికి పెద్దగా మోదీ కూడా భారత మహిళల జట్టు వరల్డ్‌ కప్‌ సాధించడంపై మురిసిపోయారు. మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ విజయం భారత్‌కు నూతన గర్వాన్ని తీసుకొచ్చింది. ఆదివారం జరిగిన ఫైలన్‌ మ్యాచ్‌లో సౌత్‌ ఆఫ్రికాపై గెలిచి ప్రపంచ కప్‌ సాధించాలన్న కల నెరవేర్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళా క్రికెట్‌ జట్టును ఆహ్వానించి అభినందించారు. వారికి మిఠాయిలు అందించడం, అప్రతిహత విజయం కోసం అభినందించడం ఊహించదగినదే. అయితే, అందరిలో సునాయాసంగా జరిగే ఫోటో సెషన్లలోనూ మోదీ ట్రోఫీని తాకకపోవడం చర్చనీయాంశమైంది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అర్హలు వారే..
ప్రపంచకప్‌ సాధించిన క్రీడాకారిణులకు గౌరవం ఇవ్వాలంటే వారి కష్టానికి ఆ విలువను స్ఫురింపజేయాలనే నియమాన్ని మోదీ భావిస్తున్నారు. ట్రోఫీని వారు ఎత్తే అర్హత సాధించారని, తమ కృషికి అది సాక్షి అని ఆయన నిశ్శబ్దంగా చూపించారు. అధికార స్థానం కంటే సాధనకు ఇచ్చిన పరమ గౌరవమే ఆయన ఆచరణలో వ్యక్తమైంది. పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ సమయంలోనూ మోదీ ఇదే విధానం అవలంబించారు. ఆ సూత్రాన్ని ఇప్పుడు మహిళా జట్టుపై కూడా అమలు చేశారు. ఆటల పట్ల ఉన్న ఆయన ఆసక్తికీ మించి ఈ చర్య క్రీడాస్ఫూర్తి పరంగా నాయకత్వ గుణాలను సూచిస్తోంది. సాధించినవారే విజయ చిహ్నాన్ని తాకాలనే భావన ఆయన వద్ద ప్రేరణగా ఉంది.

Also Read: పాకిస్తాన్ ను అక్కడ కూడా కొట్టిన భారత్

గౌరవం ఇవ్వడంమే సందేశం..
మోదీ ఈ నిర్ణయం కేవలం సంప్రదాయ సందర్భంలో తీసుకున్నది కాదు. అధికారికి కాదు, సాధకుడికే గౌరవం దక్కాలని చెప్పే మానవీయ తత్వాన్ని ఆయన ప్రకటించారు. విజయవంతమైన వారిని ప్రోత్సహించడం, ఓడినప్పుడు వారిని ప్రేరేపించడం ఆయన నిరంతర ప్రవర్తనగా మారింది. అది ఆయనను అధికారికుడి కాదు, మార్గదర్శకుడిగా నిలబెడుతోంది. మోదీ ట్రోఫీని ముట్టుకోకుండా జట్టుతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు ఆయన దృక్పథాన్ని సాక్షాత్కార వినమ్రతగా పేర్కొన్నారు.

నాయకత్వం అంటే ఆదేశించడం కాదు, గౌరవించడమనే సందేశాన్ని మోదీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రతిష్టకంటే సాధనకు ప్రాధాన్యం ఇవ్వడమే ముందుండే వ్యక్తి లక్షణం. క్రికెట్‌ అనే ఆటలో కాదు, నాయకత్వం అనే పాఠశాలలో కూడా ఈ సంఘటన ఒక స్పష్టమైన పాఠం ఇచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular