Hong Kong Sixes: క్రికెట్లో పాకిస్తాన్ జట్టు మీద భారత్ ఆధిపత్యం కచ్చితంగా ఉంటుంది.. పైగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టుతో తలపడిన మ్యాచ్ లలో టీమిండియా ఏకపక్ష విజయాలు సాధించింది. పురుషులు, మహిళల జట్లు పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ విజయాల పరంపర హాంకాంగ్ సిక్సెస్ 2025 లో కూడా కొనసాగింది. పాకిస్తాన్ జట్టు మీద భారత జట్టు మహత్తర విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన పోరులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఫస్ట్ టీం ఇండియా బ్యాటింగ్ చేసింది. సిక్స్ ఓవర్లలో నాలుగు వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 28, చిప్లీ 24, బిన్నీ 4, దినేష్ కార్తీక్ 17, మిధున్ 6 పరుగులు చేశారు.. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా పరుగులు తీశాడు. మైదానంలో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఆరు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది..
87 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు డిఎల్ఎస్ విధానానికి వెళ్లారు.. పరుగులను.. ఓవర్లను.. వికెట్లను పరిగణలోకి తీసుకొని రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిందని ప్రకటించారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు మీద భారత్ అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. 2023 వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 ఆసియా కప్.. ఇలా మొత్తం 6 మ్యాచులలో పాకిస్తాన్ జట్టుతో తలపడితే.. భారత్ అన్ని మ్యాచ్లోను విజయం సాధించింది. ఇక మహిళల జట్టు కూడా పాకిస్తాన్ మీద అలానే విజయం సాధించింది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద భారత్ సూపర్ విక్టరీ అందుకుంది.. అంతేకాదు ఫైనల్ దాకా వెళ్లి.. ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని దక్కించుకుంది.. సరిగ్గా కొద్దిరోజుల క్రితం జరిగిన లెజెండరీ క్రికెటర్ల లీగ్ లో కూడా భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో ఆడాల్సిన సందర్భంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జట్టుతో ఆడేది లేదని నిర్ణయించుకుంది. భారత ఆడక పోవడంతో పాకిస్తాన్ ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.