
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రధానంగా చేసిన ఆరోపణ.. ఫోన్ల ధ్వంసం. కానీ వీటిని పటాపంచలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత రెండవ దఫా విచారణకు హాజరైనప్పుడు తాను ఏ ఫోన్లనూ ధ్వంసం చేయలేదని, ఆ ఫోన్లు ఇవిగో అంటూ ముందుగా మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఆమె ఈడి అధికారుల విచారణకు వెళ్లిపోయారు.. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా ప్రచారాన్ని హోరెత్తించింది. ” చూశారా మా కవిత ఎంత మంచిదో.. ఈ దిక్కుమాలిన బీజేపీ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడుతోంది” అంటూ నానా యాగీ చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి ఈడీ గతంలో కవిత ధ్వంసం చేసిన ఫోన్లు తాలూకు వివరాలను మీడియాకు లీక్ చేసింది.. లో ఆమె వాడిన ఫోన్ నెంబర్లు, ఐఎంఐ నంబర్లతో సహా అందులో పొందుపరిచింది. అయితే వాస్తవానికి లిక్కర్ స్కామ్ జరిగింది 2022 కు ముందు. అయితే కవిత మీడియాకు చూపించింది 2022 కు ముందు కొనుగోలు చేసినవి. పైగా తన ఫోన్ లను పని మనుషులు, తోటి కోడళ్ళు వాడతారని అందుకే వాటిని మార్చాల్సి వచ్చిందని కవిత వివరించారు. అయితే ఈ వివరణలో పస లేకపోవడంతో ఈ ఫోన్ల బండారాన్ని సోషల్ మీడియా బట్టబయలు చేసింది.
వాస్తవానికి ఈడి అధికారులు బయటకు వెల్లడించిన ఫోన్ల ఐఎంఐ నంబర్లు వేరు, కవిత మీడియాకు చూపించిన ఫోన్ల ఐఎంఐ నెంబర్లు వేరు.. దీంతో ఇక్కడే కవిత నెటి జన్లకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె మీడియా చూపించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ఐఎంఐ నెంబర్లను నెటిజన్లు కనిపెట్టి పోస్ట్ చేయడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు నీళ్లు నమిలారు. వాస్తవానికి లిక్కర్ స్కాం కు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఫోన్ల ద్వారానే జరిగాయని, ఆ వివరాలు మొత్తం బయటపడకుండా ఉండేందుకు ఫోన్లను ధ్వంసం చేశారని ఈడి చెబుతోంది.. అయితే మొదట్లో ఈ విషయాన్ని బుకాయించిన కవిత.. తర్వాత మీడియాకు ఫోన్లను చూపించడమే ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ స్కాంలో ఎటువంటి పాత్ర తాను పోషించలేదని చెబుతున్న కవిత.. ఫోన్లను మీడియాకు ఎందుకు చూపించారు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి లిక్కర్స్ స్కాం లో కవిత ఎపిసోడ్ కు సంబంధించి విచారణ నెమ్మదించినప్పటికీ.. ఈడి అధికారులు మరోవైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు.. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఈ ఏకంగా తాను కోట్ల కొద్ది డబ్బు భారత రాష్ట్ర సమితి నాయకులకు ఇచ్చానని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.. అంతేకాదు తాను ఈ నగదును రామచంద్ర పిళ్లై ద్వారా ఇచ్చాను అని చెప్పడం లిక్కర్ స్కామ్ లో సరికొత్త మలుపు తీసుకుంది.. అయితే అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఆధారాలు తవ్వుతున్న ఈడీ అధికారులు.. మున్ముందు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.