రైల్వే సంస్థలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. రూ.1,40,000 వేతనంతో..?

భారతీయ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రైట్స్ లిమిటెడ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 48 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. https://www.rites.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఆగష్టు 25 ఈ ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 2, 2021 10:45 am
Follow us on


భారతీయ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రైట్స్ లిమిటెడ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 48 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. https://www.rites.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఆగష్టు 25 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు ఏకంగా రెండు సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుందని సమాచారం. మొత్తం 48 ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్) ఉద్యోగ ఖాళీలు 25, మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయలు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు, దివ్యాంగులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 1,40,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

2021 సంవత్సరం జులై నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.