https://oktelugu.com/

కేసీఆర్ ఇలా ఎందుకు మారారు..? హరీశ్ రావును అంతలా ఎందుకు పొగిడారు..?

తెలంగాణ ముఖ్యమంత్రి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగలడంతో కొత్త రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సిద్ధిపేటలో జరిగిన సభే ఉదాహరణ. ఈ సభలో కేసీఆర్ కొత్తగా ప్రసంగించారు. అంతకుముందెన్నడు లేని విధంగా కేసీఆర్ ప్రసంగం సాగడంతో రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా హరీశ్ రావును పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశాడు. అయితే కేసీఆర్ ఇలా మారడానికి కారణమేంటి..? Also Read: విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యను దూరం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2020 / 12:10 PM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగలడంతో కొత్త రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సిద్ధిపేటలో జరిగిన సభే ఉదాహరణ. ఈ సభలో కేసీఆర్ కొత్తగా ప్రసంగించారు. అంతకుముందెన్నడు లేని విధంగా కేసీఆర్ ప్రసంగం సాగడంతో రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా హరీశ్ రావును పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశాడు. అయితే కేసీఆర్ ఇలా మారడానికి కారణమేంటి..?

    Also Read: విద్యాశాఖ మంత్రే.. విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తున్నారా?

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. దుబ్బాకలో యాద్రుశ్చికంగా చేజారిపోయిందనుకున్న గులాబీ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అనుకున్న సీట్లు రాకపోయేసరికి ఆ పార్టీ నాయకుడు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన కేసీఆర్ పార్టీ తప్పులను సవరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా సిద్ధిపేట జిల్లా నుంచి తన వ్యూహాన్ని మార్చేశారు.

    సిద్ధిపేట జిల్లాలో జరిగిన సభలో మంత్రి హరీశ్ రావును కేసీఆర్ పోగడ్తల వర్షంతో ముంచేశారు. ఎన్నడూ లేని విధంగా హరీశ్ రావును ఇంతలా పొగడడానికి కారణమేంటనే ప్రశ్నఅందరిలో మెదిలింది. హరీశ్ రావు ఆణిముత్యం, మంచి పిల్లోడు అంటూ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు హరీశ్ రావును పొగడడానికే సిద్ధిపేట సభను ఏర్పాటు చేశారా..? అన్నట్లు ప్రసంగం సాగింది.

    Also Read: అక్కడ బీజేపీ మౌనం.. వ్యూహం ఏంటి?

    టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హరీశ్ రావును కేసీఆర్ పట్టించుకోలేదు. అంతేకాకుండా మంత్రి వర్గంలో మొదటిసారిగా చోటు కల్పించలేదు. దీంతో టీఆర్ఎస్ పై వ్యతిరేకత రావడంతో వెంటనే అప్రమత్తమైన కేసీఆర్ ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు.

    ఇక దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీశ్ రావుకే అప్పగించారు. అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి చెందడంతో హరీశ్ రావు నిరాశ చెందారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించినా అనుకున్న సీట్లు రాలేదు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి స్థానిక నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందు ముందు వారు నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేసే విధంగా పొగడ్తలు సాగించారా..? అని అనుకుంటున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్