
JD Lakshmi Narayana: జనసేన పార్టీ దూసుకుపోతోంది. తన కార్యక్రమాలు విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి వస్తున్న ప్రచారంతో ఇతర పార్టీల నేతలు జనసేనలోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నించేందుకు ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్న క్రమంలో ఆయనకు మద్దతు పెరుగుతోంది.
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం పవన్ విశాఖలో చేయనున్న ఆందోళనకు మద్దతుగా జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshmi Narayana) పవన్ ను అభినందించడం తెలిసిందే. దీంతో ఆయన మళ్లీ జనసేన పార్టీలోకి వస్తారా అనే అనుమానాలు అందరిలో ఏర్పడుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడంతో అందరి నుంచి దృష్టి జనసేన వైపు మళ్లుతోందని తెలుస్తోంది.
అయితే జేడీ లక్ష్మీనారాయణ ఇదివరకే జనసేన పార్టీలో చేరినా కొన్ని కారణాల దృష్ట్యా బయటకు వచ్చారు. కానీ పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడంతో ఆయన మళ్లీ జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు మొగ్గు చూపడంతోనే అందరు ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
రాష్ర్టంలో మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో జనసేన తన కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రజా సమస్యలనే వేదికగా చేసుకుంటోంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు జనసేనలోకి రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కీలక శక్తిగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: పవన్ ‘ఉక్కు పోరాటం’ అసలు కథేంటి..?