లోకల్ బాడీ ఎలక్షన్ల నేపథ్యంలో ఎక్కడైనా సాధారణంగా ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు సైతం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే.. ఏకగ్రీవాలు చేసుకునేందుకు కారణాలు అనేకం. అయితే.. ఏపీలో మాత్రం ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా ఢీ అంటే ఢీ అనే పరిస్థితే ఉంటుంది. అయితే అరుదుగా మాత్రమే రాజకీయ ప్రశాంతత ఉండే ప్రాంతాలుంటాయి.
Also Read: నిమ్మగడ్డకు జగన్ భారీ షాక్.. ఏకగ్రీవాలతో చెక్
కేవలం స్థానిక ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఒకే పార్టీలో రెండు మూడు వర్గాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పాత కక్షలు, రచ్చలు చెలరేగుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉండే రాష్ట్రంలో అరుదుగా అయినా కొన్ని ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. ఎవరి హయాంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పటికీ కొన్నైనా ఏకగ్రీవాలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో చివరి సారి స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలోనూ ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
వీటన్నింటి క్రమంలో.. ఏకగ్రీవాలు కేవలం బలవంతంగా జరిగేవి కావు. ఇలాంటి రాజకీయ పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు అంటే కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది నొచ్చుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే ఏకగ్రీవాలను పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.
Also Read: నిమ్మగడ్డ అభిశంసన అస్త్రం.. ఆ ఇద్దరిపై సర్కార్ ఏం చేయనుంది?
అయితే.. చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రోత్సహించి.. ఇప్పుడేమో వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఈసారి జరిగిన ఏకగ్రీవాల శాతం ఒకటి ఉంటుంది. గతంలో స్థానిక ఎన్నికల సందర్భాలు జరిగినప్పుడు ఎంత శాతం ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు ఎన్ని ఏకగ్రీవం అవుతున్నాయి.. అనే అంశాలను పరిశీలిస్తే వీరి వాదనల్లోని డొల్లతనం బయటపడుతుంది. ఏకగ్రీవాల మీద పడి ఏడవడం ఏపీలో ప్రతిపక్ష పార్టీల చేతగాని తనాన్ని చాటుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్