తెలంగాణ ఉద్యోగుల ఎదురుచూపులకు కొంత ఉపశమనం లభించింది. ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక విడుదల అయ్యింది. అయితే.. ఇందులో కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫార్సు చేసింది. పదవీ విరమణ వయస్సు కూడా 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన పీఆర్సీ నివేదిక విడుదల అయ్యింది. దీనిపై మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది.
Also Read: ఎట్టకేలకు.. 19 నెలలకు.. కేసీఆర్ సారొచ్చాడు!
పీఆర్సీ చేసిన సిఫార్సులు చూస్తే.. మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. దీంతోపాటు ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని ప్రతిపాదించింది. గరిష్ఠ వేతనం రూ.1,62,070 వరకూ ఉండొచ్చని సిఫార్సు చేసింది. హెచ్‌ఆర్‌ఏ కూడా తగ్గించింది. గ్రాట్యూటీ పరిమితి రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు ప్రభుత్వం పెంచింది. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని నిర్ణయించింది. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు.
Also Read: నిమ్మగడ్డకు జగన్ భారీ షాక్.. ఏకగ్రీవాలతో చెక్
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ఉద్యోగ పదవీ విరమణ వయసును రెండేళ్ల పెంపునకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంటే 58 నుంచి 60కి పదవీ విరమణ వయసును పెంచనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు పీఆర్సీ నివేదిక విడుదలైన తరువాత నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్