https://oktelugu.com/

బయట తిరిగితే జైలుకే.. సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్రంలో కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లో చేస్తుంది. ఏప్రిల్ 30వరకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వం యంత్రాంగం మరింత కఠిన చర్యలను అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటివరకు రోడ్లపై అవసరంగా వచ్చేవారిని పోలీసులు మందలించి వదిలేశారు. అయితే తాజాగా అనవసరం రోడ్లపైకి వాహనాలతో వచ్చేవారిని జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2020 / 12:03 PM IST
    Follow us on


    రాష్ట్రంలో కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లో చేస్తుంది. ఏప్రిల్ 30వరకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వం యంత్రాంగం మరింత కఠిన చర్యలను అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటివరకు రోడ్లపై అవసరంగా వచ్చేవారిని పోలీసులు మందలించి వదిలేశారు. అయితే తాజాగా అనవసరం రోడ్లపైకి వాహనాలతో వచ్చేవారిని జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

    రాష్ట్రంలోని లాక్డౌన్ ప్రజలంతా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. కేవలం కొందరు మాత్రమే అవనసరం బయట తిరుగుతున్నారని తెలిపారు. కరోనా కట్టడి చేయాలంటే అందరూ సహకరిస్తే సాధ్యమవుతుందని తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం వృద్ధులు, పిల్లలపై అధికంగా ఉంటుందని తెలిపారు. వీళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఆయన కోరారు. అలాగే ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

    నగరంలో పోలీసులు 24గంటలపాటు విధులు నిర్వహిస్తున్నారని కరోనా నివారణలో ప్రజలు సహకరించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 3,500పీటీ కేసులు, 182 వివిధ సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. టాఫ్రిక్ విభాగంలో 17వేలమందిపై కేసులు నమోదుగా చేయడంతోపాటు 2,724 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ నిబంధనలు తెలుసుకొని అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు.