https://oktelugu.com/

బీజేపీ నేతల మౌనం వెనుక అసలు కథేంటి?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సోము వీర్రాజును నియమించిండి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. మొన్నటివరకు ఏపీ ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారో అర్థం కావడం లేదు. అంతేకాదు.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలనూ లైట్‌గా తీసుకుంటున్నారు. ఇటీవల పురందేశ్వరి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 5:35 pm
    bjp

    bjp

    Follow us on

    bjp

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సోము వీర్రాజును నియమించిండి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. మొన్నటివరకు ఏపీ ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారో అర్థం కావడం లేదు. అంతేకాదు.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలనూ లైట్‌గా తీసుకుంటున్నారు. ఇటీవల పురందేశ్వరి విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నిస్సహాయతను మరోసారి బయట పెట్టింది.

    Also Read: టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు అతడేనా?

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దగ్గుబాటి పురంధేశ్వరిని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అది వారి అంతర్గత వ్యవహారం. కానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రన్నింగ్ కామెంటరీ ప్రారంభించారు. ఇటీవల పురంధేశ్వరికి పదవి వచ్చిన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో పలు విషయాలు మాట్లాడారు. అందులో భాగంగా ‘అమరావతి రాజధాని అనేది బీజేపీ విధానం. అలాగే కేంద్రం జోక్యం చేసుకోబోదనేది కూడా బీజేపీ విధానం’ అంటూ ఆమె చెప్పారు. కానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఆమెపై కుల ముద్ర వేస్తూ.. పేట్రేగిపోయారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శికి ఉండే స్థాయి వేరు. కానీ.. ఆమెపై విజయసాయిరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. సునీల్ ధియోధర్ మాత్రం ఓ ట్వీట్ చేసి.. విజయసాయిరెడ్డి ఎక్కడ బాధపడతారో అన్నట్లుగా విమర్శలు గుప్పించారు.

    ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడని బీజేపీ నేతల్ని విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు. గతంలో కూడా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై అదే తరహా దాడి చేశారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. బీజేపీ పార్టీ ఫండ్‌ను కూడా కన్నా నొక్కేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పురందేశ్వరిని టార్గెట్ చేశారు. అయినా బీజేపీ నేతలు మౌనంగా ఉండడం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది.

    నిజానికి ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యూహాత్మకంగా వెళుతోంది. టీడీపీని తుత్తునియలు చేసి.. జగన్ ను అధికారంలోకి కూలదోసి 2024లో అధికారమే లక్ష్యంగా వెళుతోంది. ఈ కంటగింపుతోనే  సోము వీర్రాజును.. బీజేపీని కొడాలి నాని సహా విజయసాయిరెడ్డి కించ పరిచినా పట్టించుకోవడం లేదు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. వైసీపీ నేతల బలహీనతలను చూసి కర్రు కాల్చి వాతపెట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోందట..

    Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

    జగన్ మెడకు కేసులు ఉండడం.. బీజేపీ చేతిలో ఆయన బంధీగా ఉన్నాడన్న ఆరోపణలతో కొడాలి నాని, విజయసాయిరెడ్డి వంటి వారు చెలరేగిపోతున్నారు. కానీ జగన్ మాత్రం పల్లెత్తు అనడం లేదు. టీడీపీకి ప్రత్యామ్మాయంగా ఏపీలో బీజేపీ తయారు అవుతుండడం వల్లే వైసీపీ నేతలు సహించలేక ఇలా బీజేపీ నేతలపై నోరు పారేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇప్పుడు బీజేపీ, వైసీపీ నేతల వైఖరి  ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌లా మారింది. బీజేపీ నేతలు ఎందుకిలా సైలెంట్‌ అయ్యారనే చర్చ కూడా నడుస్తోంది.