https://oktelugu.com/

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై అనుకోని ట్విస్ట్?

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీస్ మూవీల తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను తీస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాడు. Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..! ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారి మూవీ వస్తుండటంతో మెగా.. నందమూరి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 / 03:46 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీస్ మూవీల తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను తీస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాడు.

    Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారి మూవీ వస్తుండటంతో మెగా.. నందమూరి ఫ్యాన్స్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు.

    దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రారంభించినపుడు 2020 జూలై 30న రిలీజు చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే షూటింగు ఆలస్యం కావడంతో ఈ మూవీని 2021 జనవరి 8న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావించింది. ఇందులో భాగంగానే షూటింగ్ ను శరవేగంగా చేస్తుండగా కరోనా ఎఫెక్ట్ సినిమా నిలిచిపోయింది.

    కొద్దిరోజుల నుంచి షూటింగుల ప్రారంభమైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. షూటింగు ప్రారంభించే సమయానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలు కరోనా బారినపడ్డారు. దీంతో మరోసారి సినిమా షూటింగు వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ షూటింగును దర్శకుడు రాజమౌళి ప్రారంభించారు.

    Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ !

    అయితే షూటింగు ఆలస్యం కావడంతో ఈ సినిమా జూలై 30 తేదిన రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. దీంతో 2020 జూలై 30న రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సంవత్సరం గ్యాప్ తో 2021 జూలై 30న అదే తేదిన రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈసారైనా అనుకున్న సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!