https://oktelugu.com/

ఏపీ గవర్నరే ఎందుకిలా..?

రాజ్యాంగానికి అధిపతి గవర్నర్‌‌. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే ఆయన తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిందే. కాబట్టి బెంగాల్, కేరళ వంటి చోట్ల ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు. ముఖ్యమంత్రులపై విరుచుకుపడుతున్నారు. వారంతా తమది రాజ్యాంగ పరిరక్షణ విధి అని చెబుతున్నారు. ఓ సందర్భంలో బెంగాల్‌లో అల్‌ఖైదా తీవ్రవాదులు పెరిగిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్ నేరుగా ఆరోపించారు. Also Read: నిమ్మగడ్డకు జగన్ భారీ షాక్.. ఏకగ్రీవాలతో చెక్ కేరళ గవర్నర్ అయితే అసెంబ్లీ […]

Written By: , Updated On : January 27, 2021 / 02:54 PM IST
Follow us on

Biswabhushan Harichandan
రాజ్యాంగానికి అధిపతి గవర్నర్‌‌. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే ఆయన తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిందే. కాబట్టి బెంగాల్, కేరళ వంటి చోట్ల ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు. ముఖ్యమంత్రులపై విరుచుకుపడుతున్నారు. వారంతా తమది రాజ్యాంగ పరిరక్షణ విధి అని చెబుతున్నారు. ఓ సందర్భంలో బెంగాల్‌లో అల్‌ఖైదా తీవ్రవాదులు పెరిగిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్ నేరుగా ఆరోపించారు.

Also Read: నిమ్మగడ్డకు జగన్ భారీ షాక్.. ఏకగ్రీవాలతో చెక్

కేరళ గవర్నర్ అయితే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం పంపిన తీర్మానాలను కూడా తిరస్కరించారు. కానీ.. ఏపీ గవర్నర్ మాత్రం పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా.. ఎస్‌ఈసీకి సహకరించకుండా అధికారులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా సైలెంట్‌గా ఉండిపోయారు. ఎస్‌ఈసీ అదే పనిగా రాజ్‌భవన్‌కు వెళ్లి వినతులు సమర్పించుకున్నా.. విజ్ఞాపనలు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్‌ఈసీ తన బాధ్యత ప్రకారం అన్నీ గవర్నర్‌కు మొరపెట్టుకున్నారు. రాజ్యాంగ పరమైన విషయాల్లో గవర్నర్ ఆదేశాలు కీలకం కాబట్టి.. ఆయన తన వంతు ప్రయత్నాలు తాను చేశారు. కానీ.. గవర్నర్ మాత్రం ఏం జరిగినా నిమిత్తమాత్రుడైపోయారు.

అయితే.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు సైలెంట్‌గా ఉన్నారంటే అర్థం ఉంది. కానీ.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు ప్లే చేస్తున్న రోల్ చూసిన తర్వాత.. బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రలోనూ గవర్నర్లు అలాంటి యాక్టివ్ రోల్ పోషిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ అన్నట్లుగా హరించందన్ ఏం జరిగినా సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు.. ఆయన ఆర్డినెన్స్‌లు కూడా కోర్టుల్లో నిలవలేదు. అంత తప్పులు చేయడానికి కూడా గవర్నర్ ఎందుకు సిద్ధపడిపోతున్నారో అర్థం కాని పరిస్థితి.

Also Read: నిమ్మగడ్డ అభిశంసన అస్త్రం.. ఆ ఇద్దరిపై సర్కార్ ఏం చేయనుంది?

తాజాగా.. ఎస్‌ఈసీ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటే ఆ విషయంలోనూ ప్రభుత్వం తరపున మాట్లాడి.. ఆ ఆధికారులను కాపాడేందుకు గవర్నర్ చొరవ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దాని కోసం ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారాన్ని అధికార పార్టీ వర్గాలు చేస్తున్నాయి. మొత్తానికి కేంద్రం నుంచి వైసీపీకి ఉన్న సపోర్ట్ గవర్నర్ సైలెంట్ ద్వారా సాక్ష్యంగా బయటకు వస్తోందని విపక్ష పార్టీలు ఆరోపించడానికి కారణంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్