Maharashtra Election: పోలింగ్ మరి కాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అధికారాన్ని దక్కించుకునే పార్టీ ఏది? అనే అంశాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయంలో సర్వే సంస్థలకు స్వీయ నియంత్రణ అవసరమని గతంలోని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది..” ఎన్ని నమూనాలు సేకరించారు? ఎక్కడ సర్వే నిర్వహించారు? ఒకవేళ ఫలితాలు అంచనాలకు భిన్నంగా వస్తే బాధ్యత తీసుకుంటారా?” అప్పట్లో ఎన్నికల సంఘం ప్రశ్నించింది. సర్వేలతో తమకు సంబంధం ఎలా ఉంటుందని స్పష్టం చేసింది. చెబుతున్న అంచనాలకు, వెల్లడవుతున్న ఫలితాలకు సంబంధం లేదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ పట్టించుకోవడం లేదు. పైగా తమకు నచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. సర్వే విషయాలను స్పష్టం చేయడం లేదు. ఇక ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలు తలకిందులయ్యాయి. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వివరాలు తప్పుల తడకగా మారాయి.
నాడు జార్ఖండ్లో ఏం జరిగింది
జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలిచింది. బిజెపి 25 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలలో గెలుపును సొంతం చేసుకుంది. అయితే అప్పట్లో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ పీపుల్స్ అలయన్స్ కు 43, బిజెపికి 27 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఏబీపీ ఓటర్ సర్వే యూపీఏ కు 43, బిజెపికి 32 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. అయితే నాడు సర్వే సంస్థలు వేసిన అంచనా నిజమైంది. అయితే ప్రస్తుతం జార్ఖండ్ ఎన్నికల్లో పోలింగ్ 60 శాతానికి మించిన నేపథ్యంలో గతంలో మాదిరిగా ఫలితాలు రాకపోవచ్చని సర్వే సంస్థ చెబుతున్నాయి. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న జేఎంఎం మీద అవినీతి ఆరోపణలు రావడంతో జార్ఖండ్ ప్రజల ఆలోచన ధోరణి మారిందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో
మహారాష్ట్రలో ఎప్పటిలాగే తక్కువ పోలింగ్ నమోదయింది. నగర ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసారి కూడా ఆసక్తి చూపించలేదు.. ఇక ఈ రాష్ట్రంలో ఆరు పార్టీలు బరిలో ఉన్నాయి. అవి రెండు కూటములుగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మహా యుతి 144 నుంచి 152 స్థానాలలో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజస్థాన్ పలోడి సట్టా బజార్ అనే సర్వే సంస్థ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగా ఉందని సట్టా బజార్ అభిప్రాయపడింది..” ఓటింగ్ శాతం తక్కువ నమోదు అయింది. దీనివల్ల రెండు కూటములు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. దీనివల్ల అధికారంలోకి ఎవరు వస్తారు అనే విషయాన్ని బయటకు చెప్పడం సాధ్యం కావడం లేదు. ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్ తోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని” సట్టా బజార్ చెబుతోంది. మరోవైపు ఇటీవల హర్యానా ఎన్నికల తర్వాత సట్టా బజార్ కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలో చెప్పింది. కానీ వాస్తవ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ సట్టా బజార్ ప్రస్తుత కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పడం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Who will win in maharashtra and jharkhand what are the exit polls saying
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com