Banners on Hyd wall : ఒకరి ఆధిపత్యం.. మరొకరికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ వస్తున్నాడని.. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ నిర్వహించి హంగామా చేసింది బీజేపీ ప్రభుత్వం. ఎంతో మంది క్రీడాకారులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతీ ఉదయం వాకింగ్ చేసే ఈ గ్రౌండ్ ను చెత్త చెత్త చేసింది బీజేపీ.

బీజేపీ సభ అయిపోయాగానే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లిపోయారు. కానీ వారు మిగిల్చిన చెత్తాచెదారం.. శిథిలాలు మాత్రం అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టి గ్రౌండ్ కు వాకింగ్ కు వచ్చే వాకర్స్ కడిగిపారేస్తున్నారు. బీజేపీని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
జులై 3న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కూల్చివేసిన గ్రౌండ్ వాల్‌పై పరేడ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ బ్యానర్‌లను ఏర్పాటు చేసింది. “ఈ కూల్చివేసిన గోడను ఎవరు నిర్మిస్తారు? కంటోన్మెంట్ బోర్డునా లేదా బిజెపి నాయకులా?” అని బ్యానర్లు కట్టారు. కొందరు దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ప్రధాని వస్తున్నాడని.. సభ కోసం నెలరోజుల పాటు ఏర్పాట్లు చేసి హంగామా చేసిన బీజేపీ నేతలు సభ తర్వాత మాత్రం గ్రౌండ్ పరిస్థితిని పట్టించుకోలేదని వాకర్స్ విమర్శిస్తున్నారు. వాకర్స్ వాకింగ్ అనంతరం కూర్చొనే చిన్న పాటి గోడ కూలిపోయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరు నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
[…] […]