Homeఆంధ్రప్రదేశ్‌ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?

ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?


హై కోర్టు న్యాయమూర్తులను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేశారని భావించిన హై కోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఆయనకు సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు తగిన సహకారం అందించాలని ఆదేశించింది. ఈ కుట్ర వ్యవహారంపై హై కోర్టు చాలా సీరియస్ గా ఉంది. కొద్ది రోజుల కిందట హై కోర్టులో పని చేసే ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ కారణంగానే కోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మరణించడం జరిగింది. ఆ సమయంలో హై కోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

ఈ పిటీషన్ లో హై కోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని, రిజిస్ట్రార్ రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలని, మరికొన్ని అంశాలను పిటీషనర్ ప్రస్తావించారు. ఈ పిటీషన్ హై కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని హై కోర్టు పిటీషన్ కోట్టేసింది. ఈ క్రమంలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు కొన్ని ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఈ ఫిర్యాదుల విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లా సస్పెన్షన్ లో ఉన్న జడ్డి రామకృష్ణ పిటీషన్ పై విచారణ సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జడ్జి రామకృష్ణకు హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ చేసినట్లు ఆడియో వివరాలు బయటకు రావడం ఆ సంబాషణల్లో మరి కొందరు న్యాయమూర్తుల విషయంలో ఈశ్వరయ్య మాట్లాడిన మాటలు అందరిని విస్తుపోయేలా చేశాయి. ఆ ఫోన్ సంబాషణతో ఉన్నది తనేనన్న విషయాన్ని ఈశ్వరయ్య స్వయంగా దృవీకరించారు. అది వ్యక్తిగత సంబాషణగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై ఫిర్యాదు చేసిన బీసీ సంఘానికి వ్యవస్థాపకుడుగా ఈశ్వరయ్య ఉండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

జడ్డి రామకృష్ణ పిటీషన్ ను విచారిస్తున్న హై కోర్టుకు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రామకృష్ణ తరుపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. ఇది రామకృష్ణ కేసుకు సంబంధం లేని అంశమని ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. హై కోర్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకే మొగ్గు చూపింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఇందుకు సంబంధించి నివేదిక అందజేయాలని ఆదేశించింది.

జస్టిస్ ఈశ్వరయ్య ఆంధ్రపదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యవహారం వెనుక రాజకీయ కోణం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 62 కేసుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన విషయం విధితమే. దీంతో ఈ కుట్ర వెనుక అధికార పక్షం హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version