ఇలాంటి నిర్లక్ష్యాల వల్లనే ఏపీ లో ఈ ప్రమాదాలు…! జగన్ తీరు మారదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికొక ప్రమాదం సంభవిస్తోంది. అది పరిశ్రమ కావచ్చు.. భవనం కావచ్చు లేదా లోతట్టు ప్రాంతాల్లో ముంపు కావచ్చు. ఏదైనా అధికారుల నిర్లక్ష్యం వల్లనో…. ప్రభుత్వం చాలా సులువుగా ఎక్స్ గ్రేషియా రూపంలో పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్లనో ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే గత రెండు, మూడు నెలలుగా విశాఖ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.పదుల సంఖ్యలో ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి […]

Written By: Navya, Updated On : August 14, 2020 10:50 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికొక ప్రమాదం సంభవిస్తోంది. అది పరిశ్రమ కావచ్చు.. భవనం కావచ్చు లేదా లోతట్టు ప్రాంతాల్లో ముంపు కావచ్చు. ఏదైనా అధికారుల నిర్లక్ష్యం వల్లనో…. ప్రభుత్వం చాలా సులువుగా ఎక్స్ గ్రేషియా రూపంలో పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్లనో ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే గత రెండు, మూడు నెలలుగా విశాఖ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.పదుల సంఖ్యలో ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలలో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దీని కింద ఏపీ లోని ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేక సంఖ్య ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్ తరహాలో ఇవ్వనున్న ఈ ప్రత్యేక సంఖ్యను ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో వ్యవహరించనున్నారు. దీనికోసం రాష్ట్రంలోని పరిశ్రమపై సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు మొబైల్ యాప్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పరిశ్రమల్లోని వివరాలను సేకరించనుంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరుతో ప్రభుత్వం ఈ వివరాలు సేకరించనుంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఈ మధ్య పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇందులో ఆయా పరిశ్రమలు పాటించాల్సిన లేదా నిబంధన లప్రకారం అమలు లో ఉండాల్సిన సేఫ్టీ ప్రక్రియలు క్రమంగా జరుగుతున్నాయా లేదా పాటిస్తున్నారా అన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటుందా…? అన్నది ఇక్కడ పలువురు ప్రశ్న.

ఈ విషయానికి వస్తే అక్టోబర్ 15 లోపు ఒక ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోండగా.. ఇందులో పరిశ్రమల్లో భూమి, కార్మికులు, విద్యుత్, నీరు సహా తొమ్మిది వివరాలు అంశాలను పరిశ్రమల శాఖ సేకరించనుండి. వీటిలో వనరులు, ఎగుమతులు, దిగుమతులు, ముడిసరుకు లభ్యత, మార్కెటింగ్ తో సహా మరికొన్ని అంశాలు ఉన్నాయి గాని ఒక ఉన్నత స్థాయి సర్వేను పనిలోపనిగా నిర్వహించి సేఫ్టీ పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకునేలా మాత్రం ముఖ్యమంత్రి వ్యవహరించకపోవడం గమనార్హం.

ఇప్పటికే చాలా సార్లుగా ప్రభుత్వం ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నట్లు వ్యవహరిస్తూ…. ఇప్పుడు కేవలం పరిశ్రమలో జరిగే కార్యకలాపాలు, వారి ఆదాయ వివరాలను సేకరిస్తున్నాయే కానీ వారు ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు అని మాత్రం భరోసాను ఇవ్వలేకపోతున్నారు. కనీసం చర్యలు తీసుకోవటం మానేసి.. ఎన్నో మరణాలకు కారకులైన వారు బెయిల్ పై వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే.. కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని బాధితులకు ఎక్స్ గ్రేషియా రూపంలో పంచిపెడుతూ చోద్యం చూస్తున్నారు అని విమర్శకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఇలాంటి వారికి జగన్ నుంచి సమాధానం ఉంటుంది?