BJP Survey: కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రాబోతోందా?.. ఈ ఏడాది గతంకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధిస్తుందా?.. మరో ఐదేళ్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారం కోసం ఎదురు చూడక తప్పదా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కేంద్రానికి ఇంకా ఏడాదిన్నర పదవీకాలం ఉంది. అయినా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై బీజేపీ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది దేశ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మూడు ఈశాన్యారాష్ట్రాలతోపాటు రాజస్తాన్, హర్యాణా, చతీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలపై అంతర్గత సర్వే నిర్వహించింది. బీజేపీ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి.

కాంగ్రెస్‌కు కష్టకాలమే..
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శివసేన, బిహార్‌లో జేడీయూ, కర్ణాటకలో జేడీయూతో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ బీజేపీ సర్వేలో రాహుల్ భారత్‌జోడో యాత్ర ప్రభావం పెద్దగా లేదని తేలింది. యాత్ర ఫలితంగా కాంగ్రెస్‌కు పెద్దగా లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం లేదని గుర్తించినట్లు సమారాం.
కాంగ్రెస్ లోకి వెళ్లే పార్టీలకూ నష్టమే..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు ఆ పార్టీతో కలిసి వెళ్లే పార్టీలకు నష్టం తప్పదని బీజేపీ ఇంటర్నల్ సర్వేలో తేలినట్లు సమాచారం. కాంగ్రెస్‌తో ఇప్పటికే మమతాబెనర్జీ, షరద్‌పవార్, స్టాలిన్, నితీశ్‌కుమార్, కుమారస్వామి, ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు మైత్రి కొనసాగిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తే ఈ పార్టీలు కూడా నష్టపోతాయని బీజేపీ అంచనా వేస్తోంది.

ప్రజల్లో సన్నగిల్లిన విశ్వాసం..
కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సానూభూతి ఓట్లు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. మిత్రపక్షాల బలం తమకు కలిసి వస్తుందని లెక్కలువేసుకుంటోంది. కానీ బీజేపీ సర్వే మాత్రం కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని అంచనా వేసింది. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడాడనికి ఇష్టపడడం లేదని తమ సర్వేలో తేలినట్లు కమలనాథులు చెబుతన్నారు. ఈ కారణంగానే ఆ పార్టీతో కలిసి పోటీచేసేవారికీ నష్టం జరుగుతుందని బీజేపీ చెబుతోంది.
బీజేపీకి 320 సీట్లు..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 320 లోక్‌సభ సీట్లు వస్తాయని ఆ పార్టీ సర్వేలో తేలినట్లు సమాచారం. ఒంటరిగా బలమున్నా.. గత రెండు ఎన్నికల్లో ఎన్డీఏగానే బీజేపీ పోటీ చేసింది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి 280 స్థానాలు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 303 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 320, ఎన్డీఏకు 350 స్థానాలు వస్తాయని కమలం సర్వేలో తేలినట్లు సమాచారం.
మొత్తంగా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలన్న రాహుల్ ఆశ వచ్చే ఎన్నికల్లోనూ తీరే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ మరింత బలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఆ పార్టీ అంతర్గత సర్వే ఫలితాలు తేల్చాయి.