కర్ణాటక తదుపరి సీఎం ఎవరో.. లింగాయత్ లకే పట్టమా?

కర్ణాటకలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సీఎం యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో ఆయన వారసుడి కోసం ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యడ్యూరప్పను రాజీనామా చేయించి అదే సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంను చేయాలని బీజేపీ భావిస్తోంది. యడ్యూరప్ప గవర్నర్ ను కలిసి తన రాజీనామా అందజేస్తారు. అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానం సూచించిన ఎమ్మెల్యేను మిగతా ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 3:24 pm
Follow us on

కర్ణాటకలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సీఎం యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో ఆయన వారసుడి కోసం ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యడ్యూరప్పను రాజీనామా చేయించి అదే సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంను చేయాలని బీజేపీ భావిస్తోంది. యడ్యూరప్ప గవర్నర్ ను కలిసి తన రాజీనామా అందజేస్తారు.

అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానం సూచించిన ఎమ్మెల్యేను మిగతా ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు.దీంతో యడ్యూరప్ప వారసుడి కోసం అధిష్టానం అన్వేషణ సాగిస్తోంది. ఇప్పటికే 8 మందితో ఓ జాబితా తయారు చేసింది. వీరిలో నుంచి ఒకరిని సీఎంగా ఎంచుకోవడం జరుగుతుంది.

బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిన జాబితాలో ధార్వాడ్ వెస్ట్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బెన్నగౌడ పాటిల్ యాత్నాల్, కర్ణాటక గనుల శాఖ మంత్రి మురుగేష్, ఆర్ నిరానీతో పాటు హోం మంత్రి బసవరాజ్ బొమ్మై ఈ జాబితాలో ఉన్నారు. ఎలాగో లింగాయత్ వర్గానికే సీఎం పదవి దక్కనుందన్న ఊహాగానాల నేపథ్యంలో పంచమశాలి లింగాయత్ వర్గానికి వీరిలో ఎవరికి అవకాశం ఉంటుందన్న చర్చ మొదలైంది.

వీరిలో బలమైన ఆరెస్సెస్ నేపథ్యమున్న యాత్నాల్ కు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఆయన కాదంటే యడ్యూరప్ప మద్దతున్న హోంమంత్రి బొమ్మైకు కూడా అవకాశం దక్కొచ్చు. వీరితోపాటు లింగాయత్ వర్గానికి చెందిన ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, అశ్వత్ నారాయణ్, లక్ష్మణ్ సావడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి, సీటీ రవి వంటి వారు పేర్లను కూడా బీజేపీ పరిశీలిస్తోందని సమాచారం.