కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉండటం గమనార్హం. సీనియర్ సిటిజన్స్ ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ లో చేరడం ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా పొందే అవకాశం ఉంటుంది.
2023 సంవత్సరం మార్చి నెల వరకు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా సంవత్సరానికి 1,11,000 రూపాయలు పెన్షన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా పొందే పెన్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదిక ఆధారంగా డబ్బులు మారే అవకాశం ఉంటుంది. కనీసం నెలకు 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 9,250 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కాలపరిమితి 10 సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు 3 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తో పాటు పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వయస్సు పైబడిన వారికి ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.