పంజాబ్ లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈనెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10, 11, 12, తరగతి విద్యార్థులకు బడులు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య శాఖ సూచన మేరకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.