డిసెంబర్ 10న చిత్రపురి హౌసింగ్ సొసైటీకీ హోరాహోరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో మొత్తం వినోద్ బాల ప్యానెల్ తోపాటు సి.కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’.. ఓ.కళ్యాణ్ ప్యానెల్.. కొమర వెంకటేశ్ ప్యానెల్స్ పోటీపడ్డాయి.
Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..
చిత్రపురిలో నాలుగు ప్యానెల్స్ బరిలో నిల్చున్నప్పటికీ ఇప్పటికే అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానలే గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ప్యానల్ నుంచి మొత్తం 11మంది అభ్యర్థులు పోటీ చేయగా 10మంది గెలుపొందారు.
వీరిలో వల్లభనేని అనిల్ కుమార్.. అనుముల మహనంద రెడ్డి.. అళహరి.. కాదంబరి కిరణ్.. కొంగర రామకృష్ణ ప్రసాద్.. పీఎస్ఎన్. దొర.. ప్రవీణ్ కుమార్ యాదవ్.. నిమ్మగడ్డ అనిత.. దీప్తి వాజ్ పేయి.. టి.లలితలు గెలుపొందారు. ఈ ప్యానల్లో చిల్లర వేణు ఒక్కరే ఓడిపోయాడు.
Also Read: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఏపీకి శ్రీలక్ష్మి!
శనివారం చిత్రపురిలో జరిగిన సమావేశంలో వినోద్ బాల ప్యానల్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించింది. చిత్రపురి హిల్స్ హౌసింగ్ సొసైటీకి 2020 -2025గానూ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని నియమాకమయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా వి.ప్రవీణ్ కుమార్ యాదవ్.. కార్యదర్శిగా కాదంబరి కిరణ్.. కోశాధికారిగా అనుముల మహానందరెడ్డిలు నియామకం అయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రపురి హిల్స్ కు సంబంధించి రెండేళ్ళుగా ఎన్నో సమస్యలను వినోద్ బాల ప్యానల్ పరిష్కరించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ మిగిలిన సమస్యలన్నింటీని త్వరితగతిన పరిష్కరించనున్నట్లు వారు తెలిపారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్