700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న ఆందోళన రోజురోజుకు ఉధ్రుతమవుతోంది. ప్రభుత్వంతో రైతులు జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈనెల 14 వరకు ఆందోళన కార్యాచరణ రూపొందించి రోజుకో రకంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీ సరిహద్దల్లోని జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతులు ఆందోళన చేస్తున్న రహదారులను దారి మళ్లించింది. ఇటువైపు వచ్చేవారికి ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసింది. Also Read: […]

Written By: NARESH, Updated On : December 12, 2020 1:03 pm
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న ఆందోళన రోజురోజుకు ఉధ్రుతమవుతోంది. ప్రభుత్వంతో రైతులు జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈనెల 14 వరకు ఆందోళన కార్యాచరణ రూపొందించి రోజుకో రకంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీ సరిహద్దల్లోని జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతులు ఆందోళన చేస్తున్న రహదారులను దారి మళ్లించింది. ఇటువైపు వచ్చేవారికి ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసింది.

Also Read: ఇకపై ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్..!

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిలో పంజాబ్ కు చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే వీరికి పలువరు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. శనివారం తలపెట్టిన రహదారి దిగ్బంధంలో పాల్గొనడానికి పంజాబ్ రాజధాని అమ్రుత్ సర్ నుంచి 700 ట్రాక్టర్లలో రైతులు వస్తున్నారు. పంజాబ్ లోని రైతులే కాకుండా ఇతర వర్గాల ప్రజలు రైతులకు మద్దతుగా ఇక్కడకు వస్తున్నారు.

ఇక రైతులు టోల్ ప్లాజాల రుసుమును అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఢిల్లీ సరిహద్దులోని టిక్రీ, ధన్సా రహదారులు నిరసనలతో ఇప్పటికే మూత పడ్డాయి అయితే పోలీసులు రైతులను మాస్కులు ధరించాలని కోరుతున్నారు. సింఘ సరిహద్దు వద్ద కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు.

Also Read: ఒప్పందాలకు మేం కట్టుబడే ఉన్నాం.. ఉల్లంఘిస్తున్నది చైనాయే : భారత్

గత 16 రోజులుగా రైతులు చేస్తన్న ఆందోళనపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ఎవరి పట్టులో వారే ఉన్నారు. కొన్ని సవరణలతో ప్రతిపాదలను పంపిన ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. ఇక ఎముకలు కొరికే చలిలోనూ రైతులు నిరసన తెలపడంతో వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్