https://oktelugu.com/

ఏపీ మంత్రికి కంట్లో నలుసుగా మారిన జనసేన నేత..!

ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ పై విమర్శలు ఎవరు చేస్తారంటే ముందుగా టీడీపీ, ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. అయితే జనసేన కూడా విమర్శలు చేస్తూ కంట్లో నలుసుగా మారిందంటే ఎవరూ నమ్మరు.ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎక్కువగా కనిపించేది ముందుగా పవన్ కల్యాణ్ ఆ తరువాత నాదెండ్ల మనోహార్. కానీ ఇప్పుడు మరో నేత ఏకంగా అధికార పార్టీ మంత్రిపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ జనసేన నేతతో ఆ మంత్రి సఫర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2020 / 01:14 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ పై విమర్శలు ఎవరు చేస్తారంటే ముందుగా టీడీపీ, ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. అయితే జనసేన కూడా విమర్శలు చేస్తూ కంట్లో నలుసుగా మారిందంటే ఎవరూ నమ్మరు.ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎక్కువగా కనిపించేది ముందుగా పవన్ కల్యాణ్ ఆ తరువాత నాదెండ్ల మనోహార్. కానీ ఇప్పుడు మరో నేత ఏకంగా అధికార పార్టీ మంత్రిపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ జనసేన నేతతో ఆ మంత్రి సఫర్ అవుతున్నాడన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..

    ఏపీలో ఎక్కువగా విమర్శలు, తిట్ల దండకాలు టీడీపీ, వైసీపీల మధ్య సాగుతుంటాయి. అప్పడప్పుడు కాంగ్రెస్ నాయకులు మైకులు పట్టుకున్నా వైసీపీ నేతలు టీడీపీ నాయకులను తప్ప ఎవరూ విమర్శించినా పట్టించుకోరు. కానీ జనసేన కు చెందిన పోతిన మహేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై రోజుకోరకంగా విరుచుకుపడుతున్నాడట. వెల్లంపల్లికి పోతిన మహేశ్ కంట్లో నలుసులాగా మారాడాని అనుకుంటున్నారు.

    విజయవాడకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన వ్యాపారుల దగ్గర చందాలు వసూల చేయడం దగ్గర్నుంచి మంత్రిగా తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆలయాల భూముల్ని కాజేస్తున్నాడని పోతిన మహేశ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా విజయవాడ దుర్గ గుడిలో మాయమైన సింహాలు వెల్లంపల్లి ఇంట్లోనే ఉన్నాయని పోతిన మహేశ్ అంటున్నారు. ఇక రూ.300 కోట్ల విలువ చేసే భూముల్ని కాజేయడానికి పెద్ద ప్రణాళిక వేశాడని అంటుండడంతో వైసీపీ నాయకుల్లోనూ చర్చ మొదలైంది.

    Also Read: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఏపీకి శ్రీలక్ష్మి!

    ఇలా కనీసం పార్టీ నుంచి కూడా సపోర్టు లేని పోతిన మహేశ్ మంత్రిపై ఎడాపెడా ఆరోపణలు చేయడంతో ఆయనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చాయట. అయినా వాటిని లెక్క చేయకుండా వెల్లంపల్లిపై విరుచుకుపడడం హాట్ టాఫిక్ గా మారింది. ఇలా జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు తెగింపును ప్రదర్శిస్తే పార్టీ మనుగడ సాధించడం కష్టమేమీ కాదని అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్