https://oktelugu.com/

AP Cabinet Expansion: ఏపీ మంత్రివర్గంలో ఆ ఐదారుగురు ఎవరు?

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మంత్రివర్గంలో చేరేదెవరు? పాతవారిలో ఎవరిని కొనసాగిస్తారనే విషయంపై అందరిలో ఉత్కంఠ సాగుతోంది. మంత్రులంతా నిన్ననే రాజీనామాలు చేసినా వారిలో ఐదారుగురు మాత్రం పాతవారు కొనసాగుతారనే విషయం మంత్రి కొడాలి నాని చెప్పడంతో వారు ఎవరనే దానిపైనే చర్చ సాగుతోంది. పాతవారిలో సమర్థులైన వారిని తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో జగన్ సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. ఇప్పటికి కొత్త వారెవరు? పాత […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 8, 2022 / 08:47 AM IST
    Follow us on

    AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మంత్రివర్గంలో చేరేదెవరు? పాతవారిలో ఎవరిని కొనసాగిస్తారనే విషయంపై అందరిలో ఉత్కంఠ సాగుతోంది. మంత్రులంతా నిన్ననే రాజీనామాలు చేసినా వారిలో ఐదారుగురు మాత్రం పాతవారు కొనసాగుతారనే విషయం మంత్రి కొడాలి నాని చెప్పడంతో వారు ఎవరనే దానిపైనే చర్చ సాగుతోంది. పాతవారిలో సమర్థులైన వారిని తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    AP Cabinet Expansion

    మంత్రివర్గ విస్తరణలో జగన్ సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. ఇప్పటికి కొత్త వారెవరు? పాత వారిలో ఎవరిని కొనసాగిస్తారనే దానిపై క్లారిటీ లేదు. దీంతో అందరు ఆతృతగా ఉన్నారు. ఎవరి జాతకం మారనుందో? ఎవరికి అందలాలు దక్కనున్నాయో అనే దానిపై అందరు తమ జాతకం మారనుందా? లేదా? అనే దానిపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంల మంత్రివర్గ విస్తరణ అందరికి సస్పెన్స్ థ్రిల్లర్ గానే కనిపిస్తోంది.

    Also Read: KCR Vs Tamilisai: ఢిల్లీ వేదికగా ముదురుతున్న సీఎం, గవర్నర్ పంచాయితీ?

    సామాజిక సమీకరణలు, పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చి పాత వారిలో ఐదారుగురిని మంత్రులుగా కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కానీ వారెవరనే దానిపై ఇంకా 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనా? జగన్ ఎందుకు ఇంత రహస్యంగా ఉంచుతున్నారు. ఎప్పటికైనా పేర్లు బయటపెట్టాల్సిందే కదా. ఇంత సీక్రెట్ మెయింటెన్ చేసి చివరకు ప్రకటించాల్సిందే అయినా జగన్ మదిలో ఏముందో తెలియడం లేదు.

    Y S Jagan

    మంత్రి పదవి పోయిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని ఇదివరకే చెప్పడంతో ఇష్టం లేకున్నా తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. పాతవారిని కొనసాగించే ఉద్దేశంలో ఉన్నా కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వారికి కూడా అవకాశాలు లేకపోవడంతో పాతవారిలో ఎవరిని కొనసాగిస్తారనే దానిపై అందరిలో ఒకటే ఉత్కంఠ రేగుతోంది. జగన్ ఏమనుకుంటున్నారో? ఎవరిని తీసుకుంటారో తెలియడం లేదు.

    Also Read:Kodali Nani: కేబినెట్ లోకి కొందరు సమర్థులు కావాలన్న కొడాలి నాని.. ఇప్పుడున్న వాళ్లంతా అసమర్థులేనా?

    Tags