https://oktelugu.com/

Sri Leela: గుడ్డిగా ‘రష్మిక’నే ఫాలో అవుతుంది.. మరి ఎదుగుతుందా ?

Sri Leela: ఇండస్ట్రీలో సింగిల్ హిట్ వస్తే.. లైఫ్ చాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల లైఫ్ ఓవర్ నైట్ లోనే చేంజ్ అయిపోతుంది. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హీరోయిన్ లో మ్యాటర్ ఉంది అని టాక్ తెచ్చుకున్నా చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. అయితే, నాలుగు ఆఫర్లు వచ్చే సరికి, తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. ఇష్టం వచ్చినంత అడుగుతారు సదరు హీరోయిన్లు. కోటి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 8, 2022 / 08:39 AM IST
    Follow us on

    Sri Leela: ఇండస్ట్రీలో సింగిల్ హిట్ వస్తే.. లైఫ్ చాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల లైఫ్ ఓవర్ నైట్ లోనే చేంజ్ అయిపోతుంది. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హీరోయిన్ లో మ్యాటర్ ఉంది అని టాక్ తెచ్చుకున్నా చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. అయితే, నాలుగు ఆఫర్లు వచ్చే సరికి, తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. ఇష్టం వచ్చినంత అడుగుతారు సదరు హీరోయిన్లు.

    srileela

    కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అలాగే తన రెమ్యునరేషన్ ను దారుణంగా పెంచేసింది. ఇక రష్మిక గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? ఆమె రేంజ్ ఆకాశంలో ఉంది. పోనీ కొత్త పిల్ల ‘శ్రీలీల’ను ట్రై చేద్దాం అంటే.. ఆమె కూడా కోటి అడుగుతుంది. పైగా ‘శ్రీలీల’కి విపరీతంగా డిమాండ్ పెరిగింది.

    Also Read: Natti kumar Sensational Comments On RGV: మోసం చేశావయ్యా అంటే.. ఇది ఆ కథ అంటున్నాడు !

    ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు చిత్రాలున్నాయి. అలాగే మరో సినిమాకు సైన్ చేయడానికి ఒప్పుకుంది. అంటే.. శ్రీలీల చేతిలో మొత్తం 3 సినిమాలున్నాయి. ఇక కృతి శెట్టి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ రేంజ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ మరొకరు లేరు. దాంతో మీడియం రేంజ్ సినిమాలకు కృతి శెట్టి, శ్రీలీల అందుబాటులో లేకుండా పోయారు.

    అందుకే, కృతి శెట్టితో సినిమాలు ప్లాన్ చేసుకున్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అన్నీ.. కృతి ప్లేస్ లో కేతిక శర్మతో సరిపెట్టుకుంటున్నాయి. ఇక రొమాంటిక్ అనే చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన కేతిక శర్మలో మ్యాటర్ ఉంది. పైగా ఆ సినిమా బీసీ సెంటర్లలో బాగానే ఆడింది అని టాక్ ఉంది. పైగా గ్లామర్ విషయంలో కేతిక శర్మకి ఫుల్ నేమ్ వచ్చింది.

    Sri Leela

    దాంతో, కేతిక శర్మ ఖాతాలో కొత్తగా నాలుగు చిత్రాలు వచ్చి పడ్డాయి. వరుసగా తనకు ఆఫర్లు వచ్చేసరికి ఈ భామకు ఏమి చేయాలో ఎంత అడగాలో అర్థం కావడం లేదు. దాంతో గుడ్డిగా రష్మికను ఫాలో అయిపోతుంది. కాకాపోతే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కోటి మాత్రమే అడుగుతోంది. తాను కూడా రష్మిక మందన్నాలా కెరీర్ ను సెట్ చేసుకోవాలని ఆశ పడుతుంది. మరి రష్మిక లాగే కేతిక శర్మ కూడా ఎదుగుతుందా ? చూడాలి.

    Also Read: 18 Pages Glimpse Video: ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు

    Tags