వ్యాక్సిన్ల తప్పు రాష్ట్రాలదా? కేంద్రానిదా?

మొత్తానికి తప్పు జరిగిపోయింది. ముందుచూపు లేకుండా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడంతో దేశంలో వ్యాక్సిన్ల కొరత దాపురించింది. వేసుకుందామని జనాలు రెడీగా ఉన్నా.. వేసేందుకు టీకాలు లేని దుర్భర పరిస్థితి. మరి దీనికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తే.. ఆసక్తికర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్.. దేశంలో వ్యాక్సిన్ల కొరతకు కేంద్రం కారణమని.. ముందుచూపు లేకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంచిందని.. ఉచితంగా అందించిందని.. ఇప్పుడు దేశంలో కొరతకు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిందించారు. ఇక కేంద్రప్రభుత్వం మాత్రం […]

Written By: NARESH, Updated On : June 7, 2021 9:27 am
Follow us on

మొత్తానికి తప్పు జరిగిపోయింది. ముందుచూపు లేకుండా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడంతో దేశంలో వ్యాక్సిన్ల కొరత దాపురించింది. వేసుకుందామని జనాలు రెడీగా ఉన్నా.. వేసేందుకు టీకాలు లేని దుర్భర పరిస్థితి. మరి దీనికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తే.. ఆసక్తికర ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా మంత్రి కేటీఆర్.. దేశంలో వ్యాక్సిన్ల కొరతకు కేంద్రం కారణమని.. ముందుచూపు లేకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంచిందని.. ఉచితంగా అందించిందని.. ఇప్పుడు దేశంలో కొరతకు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిందించారు. ఇక కేంద్రప్రభుత్వం మాత్రం రాష్ట్రాలు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు 6 కోట్ల టీకాలు పంపితే కనీసం 2 కోట్లు కూడా వేయలేదని.. దీనికి రాష్ట్రాలదే తప్పు అని స్పష్టం చేసింది.

ఇక బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కేంద్రం వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. కలిసికట్టుగా రాష్ట్రాలన్నీ పోరాటం చేద్దామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు తగువులాడుకుంటూ వ్యాక్సినేషన్ పై మాత్రం ఎవరూ శ్రద్ధ చూపని పరిస్థితి నెలకొంది.

కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను వ్యాక్సిన్లు వేయలేదని లెక్కలతో తాజాగా కొట్టింది. ఏపీకి జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 65.50 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపామని.. ప్రజలకు పంచింది కేవలం 26 .10 లక్షలు మాత్రమేనని ఏపీ సర్కార్ వైఫల్యాన్ని కళ్లకు గట్టింది. 40 లక్షల వ్యాక్సిన్లు వేయలేదని.. వృథా కూడా ఎక్కువేనని కేంద్రం లెక్కలు చూపింది.

ఇక తెలంగాణకు కేంద్రం 41.40 లక్షల డోసులు పంపిస్తే మూడు నెలల్లో కేవలం 13 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేశారని 2.25లక్షల డోసులు వృథా చేశారని కేంద్రం నిలదీసింది. బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కూడా వ్యాక్సిన్లలో సంగం కూడా వాడలేదని స్పష్టం చేసింది.

అయితే కేంద్రం విడుదల చేసిన జాబితాలో బీజేపీయేతర రాష్ట్రాలే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావించకపోవడంపై ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాలు మండిపడుతున్నాయి.

అయితే ఒక్కటి మాత్రం నిజం.. మొదటి వేవ్ ముగిశాక ఇక కరోనా రాదని అటు కేంద్రం, ఇటురాష్ట్రాలు రిలాక్స్ అయ్యాయి. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాతనే వ్యాక్సినేషన్ ఊపందుకుంది. అప్పటికీ వ్యాక్సిన్ల కొరత అనివార్యమైంది. వ్యాక్సిన్లపై వ్యతిరేక ప్రచారం సాగడంతో ఎవరూ వేసుకోవడానికి ముందుకు రాలేదు. సెకండ్ వేవ్ రాగానే ఎగబడడంతో వ్యాక్సిన్ కొరత దాపురించింది. దీంతో ఈ పాపంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు భాగం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది.