తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నారు. తన ఉద్వేగభరిత ప్రసంగాల ద్వారా ప్రజల సమస్యలపై పోరాడేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే గజ్వేల్ లో నిరుద్యోగంపై విమర్శలు చేసిన ఆమె సర్కారు ప్రవర్తిస్తున్న తీరుపై తమదైన శైలిలో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
తెలంగాణ అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో పరిపాలన సరిగా లేదని చెప్పారు. నిరుద్యోగం తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అమరుల త్యాగాలు వృథా అయ్యే ప్రమాదం ఉందని వాపోయారు.అయినా పాలకులు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారని వివరించారు. ప్రజల సమస్యలు పట్టించుకుని వారి సాదకబాదకాలు తీర్చాని కోరారు.
రాష్ర్టంలో కరోనా కకావికలం చేస్తుందన్నారు. ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు ప్రైవేటుకు ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అని పేర్కొన్నారు. కమీషన్ల కోసం ఆశపడుతున్నారా అని అడిగారు. వ్యాక్సినేషన్ కోసం ఇంకా ఎన్నేళ్లు పడుతుందన్నారు. దొరల పాలన ఇంకెన్నాళ్లు సాగుతుందని అన్నారు.
ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త పార్టీ పెడతానని పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేస్తన్నట్లు చెప్పారు. తాజా పరిస్థితుపై స్పందించారు.ప్రభుత్వం పట్టించుకుని సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు.