https://oktelugu.com/

టీడీపీలో ఏమిటీ దారుణ పరిస్థితి?

మొన్నటివరకు అధికారంలో ఉన్న పార్టీ.. దాదాపు 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పార్టీ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేతిలోని పార్టీకి ఇంతటి దారుణ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రత్యర్థి జగన్ దెబ్బకు ఇప్పుడు టీడీపీలో ఆశావహులే లేకుండా పోయిన దైన్యం అందరినీ కలవరపెడుతోంది. అస్సలు పదవులు తీసుకోమంటే కూడా ముందుకు రాని దుస్థితి నెలకొందంటే టీడీపీ పని అయిపోయినట్టేనా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. Also Read: ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2020 7:40 pm
    Follow us on


    మొన్నటివరకు అధికారంలో ఉన్న పార్టీ.. దాదాపు 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పార్టీ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేతిలోని పార్టీకి ఇంతటి దారుణ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రత్యర్థి జగన్ దెబ్బకు ఇప్పుడు టీడీపీలో ఆశావహులే లేకుండా పోయిన దైన్యం అందరినీ కలవరపెడుతోంది. అస్సలు పదవులు తీసుకోమంటే కూడా ముందుకు రాని దుస్థితి నెలకొందంటే టీడీపీ పని అయిపోయినట్టేనా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.

    Also Read: ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే చర్చ..!

    ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా.. బలమైన మీడియా సపోర్టు ఉన్న టీడీపీలో చాలా ముఖ్యమైన పదవిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం.. చాలా మంది తిరస్కరించడం పార్టీకి అవమానంగా మారింది. ఈ పదవిని ఆక్రమించే ఎవరైనా సాధారణంగా టీడీపీ అధిష్టానానికి.. ముఖ్యంగా నారా లోకేష్ కు చాలా దగ్గరి వారు అవుతారు. కానీ ఈ పెద్ద పోస్టును ఎవరూ ఇస్తామన్నా తీసుకోకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.

    ప్రస్తుతం టీడీపీ అనుబంధ విభాగాల కోసం కమిటీలను వేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ కీలకమైన పోస్టులో ఎవ్వరినీ అడిగినా తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం పార్టీని నివ్వెర పరుస్తోంది.

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత దేవినేని అవినాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

    Also Read: జగన్ పై కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టిన ఎంపీ..

    ఈ పదవిలో తొలుత బ్రహ్మం చౌదరిని నియమించాలని చంద్రబాబు పరిశీలించారు. కానీ బ్రహ్మం చౌదరి తాను డబ్బును ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నానని.. ఈ నాలుగేళ్లు భరించడం కష్టమని.. ఈ పదవిని తీసుకోవడానికి ఇష్టపడక వైదొలగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు కనీసం నాలుగేళ్ల పాటు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే ఏదో లాభం వస్తుందని అప్పటిదాకా ఖర్చు భరించడం తన వల్లకాదని వద్దన్నట్టు తెలిసింది.

    ఇక చంద్రబాబు ఆ తర్వాత సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల రవిని.. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ను ఈ పదవిని చేపట్టమని కోరినట్లు సమాచారం. కానీ ఇద్దరూ వద్దన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఆదిరెడ్డి అప్పరావు కుమారుడు ఆదిరెడ్డి వాసుకు కూడా ఈ ఆఫర్ ను ఇవ్వగా తిరసర్కించినట్టు తెలిసింది.

    ఇలా అందరూ తీసుకోమ్మన్నా ప్రస్తుతానికి తెలుగు యువత అధ్యక్ష పదవిని వద్దు బాబోయ్ అంటూ అందరూ ఈసడించుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ఈ పదవి ఖాళీగా ఉండడం విశేషమే మరీ.. ఎక్కడైనా పార్టీ పదవుల కోసం వెంపర్లాడే నేతలను చూస్తాం.. కానీ టీడీపీలో ట్రెయిన్ రివర్స్ కావడం గమనార్హం.