https://oktelugu.com/

జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్

2019 ఎన్నికల తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి ఏకపక్షంగా వీయడంతో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఓ చేత్తో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోచేత్తో ప్రత్యర్థులకు స్కెచ్ గీస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లోకి దూసుకెళుతోన్నారు. మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ చెందిన పలువురు నేతలను జైళ్లకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 07:25 PM IST
    Follow us on


    2019 ఎన్నికల తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి ఏకపక్షంగా వీయడంతో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఓ చేత్తో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోచేత్తో ప్రత్యర్థులకు స్కెచ్ గీస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లోకి దూసుకెళుతోన్నారు. మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ చెందిన పలువురు నేతలను జైళ్లకు పంపించి ఆపార్టీని చావుదెబ్బ కొట్టారు.

    Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..

    చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రులు పనిచేసిన నేతలు ఒక్కొక్కరుగా జైళ్లబాట పడుతున్నారు. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులుపుడుతోంది. ప్రభుత్వం ఎప్పుడూ ఏ స్కామ్ బయటికితీసి జైళ్లోకి పంపుతుందోననే భయాందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుండటంతో ఆపార్టీకి చెందిన నేతలంతా ప్రస్తుతం సైలంటయ్యారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు సైతం త్వరలోనే జైళ్లకు వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా అరెస్టుల వ్యవహారాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

    అయితే చంద్రబాబు ఆర్థిక మూలలను దెబ్బతీసేందుకు సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణాలు చూస్తుంటే బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కొద్దిరోజుల్లో భారీగా దివాళా తీయడం ఖాయమనే వాదన విన్పిస్తుంది. బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ ఏపీలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. హెరిటేజ్ కంపెనీ తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విస్తరించి పాలవ్యాపారంతో లాభాలను ఆర్జిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు చూస్తున్నారు. కొన్నాళ్ళు లోకేష్ కంపెనీ వ్యవహాలను చూసినా ఇప్పుడు పాలిటిక్స్ కే పూర్తిగా అంకితమయ్యారు.

    బాబుకు హెరిటేజ్ కంపెనీ కొండంత అండగా ఉంది. ఇప్పుడు దానిని దెబ్బకొట్టేందుకు జగన్ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పతుల సంస్థగా ఉన్న అమూల్ డైరీతో రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాజాగా ఒప్పందం కుదుర్చుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. దీంతో ఏపీలో పాల ఉత్పత్తుల మార్కెట్ లోకి అమూల్ ప్రవేశిస్తుంది. ప్రభుత్వ అండతో అమూల్ రాష్ట్రంలో కార్యకలాపాలు చేపడితే ముందుగా దెబ్బపడితే మాత్రం హెరిటేజ్ కేనని తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

    ఏపీలోకి అమూల్ ఎంట్రీతో హెరిటేజ్ కంపెనీ ఆదాయానికి భారీగా గండిపడనుంది. ప్రభుత్వం కూడా పాడిరైతులకు మరింతగా ప్రోత్సాహాకాలు ఇచ్చి వారిని అమూల్ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్న అమూల్ కంపెనీ ఏపీలో నిలదొక్కుకుంటే హెరిటేజ్ కంపెనీ తీవ్రనష్టం వాటిల్లే అవకాశ ఉందనే టాక్ విన్పిస్తుంది. ఇది ఒకరకంగా బాబు ఆర్థిక మూలాలకు దెబ్బేయడమేనని అంటున్నారు.

    ప్రభుత్వం మాత్రం పాడిరైతులకు శ్రేయస్సు కోసం అమూల్ ఎంట్రీకి తలుపుకు తెరిచినట్లు చెబుతుంది. అమూల్ రాకతో పాడిరైతులకు మరింత గిట్టుబాటు ధర లభించి ఆర్థికంగా ఎదుగుతారని చెబుతోంది. ఏదిఏమైనా జగన్ వ్యూహానికి బాబు ఆర్థిక మూలాలు కుదేలవడం ఖాయంగా కన్పిస్తోంది. దీని నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారో వేచిచూడాల్సిందే..!