ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కగానే అమరావతి పేరిట టీడీపీ సాగించిన భూదందాను తవ్వితీసి వెంటనే మూడు రాజధానులంటూ విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ, దాని అనుకూల మీడియా ఎంత గత్తెర లేపినా వెనక్కితగ్గలేదు.
తాజాగా ఆ బిల్లులను ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ చేతిలో బంతిని పెట్టారు. ఆయన ఆమోదిస్తారని.. జగన్ భావిస్తున్నారు. ఆయన ఆమోదించకుండా చంద్రబాబు.. ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి.
Also Read: కోవిడ్ బారిన పడిన విజయసాయి..
ఈ క్రమంలోనే బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారద ట్వీట్ చేయడం సంచలనమైంది. ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన ఏపీ గవర్నర్ హరిచందన్ ను కోరారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. వనరులు వృథా కాకుండా చూడాలని ఆయన కోరారు.
కాగా ఏపీలోని మూడు రాజధానులపై ఏకంగా ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగడం.. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు ఊపు వచ్చినట్టైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సైతం స్టాండ్ మార్చుకుందని.. జగన్ కు వ్యతిరేకంగానే వెళ్లడానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది.
Also Read: జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డే గెలిచాడు!
తాజాగా ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ హరిచందన్ జారీ చేసిన ఆదేశాలతో ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులను కూడా గవర్నర్ తో తిరస్కరించేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ అడుగులు పడుతుండడం వైసీపీ అధిష్టానానికి మింగుడు పడని అంశంగా మారుతోంది.
-ఎన్నం