https://oktelugu.com/

సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి.. ఆయన ఎవరు? ఏం చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్‌ మామ, వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. Also Read: కేసీఆర్ తో ఫైట్ కు రెడీ అయిన జగన్? ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ ఈసీ చిన్న గంగిరెడ్డి మరణం వారింట విషాదం నింపింది.కడప జిల్లా వేముల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 09:26 AM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్‌ మామ, వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

    Also Read: కేసీఆర్ తో ఫైట్ కు రెడీ అయిన జగన్?

    ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ ఈసీ చిన్న గంగిరెడ్డి మరణం వారింట విషాదం నింపింది.కడప జిల్లా వేముల మండలం గొల్లల  గూడూరుకు చెందిన ఆయన ప్రముఖ వైద్యుడు. ఆయన అంత్యక్రియకలు ఈరోజు మధ్యాహ్నం అక్కడే నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు జగన్‌ హాజరు కానున్నారు.

    2001-05లో పులివెందుల ఎంపీపీగా గంగిరెడ్డి గెలిచారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల  నుంచి కడప కలెక్టరేట్ వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేసి వార్తల్లో నిలిచారు.

    Also Read: నేడు చప్పట్లు కొట్టనున్న జగన్.. ఎందుకంటే?

    ఇటీవలే సీఎం జగన్ మామ గంగిరెడ్డి పరిస్థితి విషమించడంతో తిరుమల నుంచి హైదరాబాద్ వచ్చి పారమర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నారు.