ప్రధాన మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయా..? రానున్న కాలంలో ఈ నిర్ణయాలు ప్రతిబంధకాలుగా మారనున్నాయా..? మున్ముందు జరుగనున్న ఎన్నికలు కూడా ఈ నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయా..? మోడీ నిర్ణయాలు నచ్చకనే ఒక్కో పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వెళ్లిపోతోందా..? ఇప్పటివరకు తిరుగులేని శక్తిగా ఉన్న మోడీ ఇమేజీ పడిపోతోందా..? రాజకీయ గ్రాఫ్ దెబ్బతింటోందా..? ప్రస్తుతం కేంద్ర స్థాయిలో రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఇది.
Also Read: బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?
ఇప్పటికే కరోనాతో దేశం ఆర్థికంగా ఎంతో వెనుకబడిపోయింది. క్లిష్టపరిస్థితుల్లోనే ఉంది ఇంకా. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలకు కనీసం జీఎస్టీ పరిహారం కూడా చెల్లించడం లేదు. దీంతో మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి కూడా మొదలయింది. తమకు మద్దతిస్తున్న పార్టీలే మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ మొండిగానే ముందుకు పోయేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఉంటుందంటున్నారు. మరికొద్ది రోజుల్లో బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ వంటి రాష్ట్రాల శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయంటున్నారు విశ్లేషకులు.
మోడీ తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాయో అందరం చూస్తూనే ఉన్నాం. ఏకంగా మిత్రపక్షమైన పార్టీ నుంచి ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. కూటమి నుంచి తప్పుకునేందుకు సిద్ధపడింది. అటు రాష్ట్రాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ టైంలో వాటిని ఆదుకోవాల్సింది పోయి ఉన్న నిధులకు కోత విధించడంతో కోపంతో ఊగిపోతున్నారు.
Also Read: సుశాంత్ చనిపోయే ముందు వరకు రియాతోనే ఉన్నాడా?
బీహార్ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేవు. ఎన్నికల సమయంలో ఈ బిల్లుల గొడవ నితీష్ కుమార్‌కు ఇబ్బందికరంగా మారింది. అసలేం ఈ సందర్భంలో తీసుకొచ్చిన బిల్లుపై ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్. అయితే.. వేటినీ లెక్కచేయని మోడీ తన పంథాలోనే వెళ్తున్నారు. ఎన్నికలను.. పార్టీలను లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. మరి మున్ముందు జరిగే నష్టానికి కూడా మోడీనే బాధ్యత వహించాల్సి వస్తుంది మిత్రపక్షాలు అంటున్నాయి.