బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?

సందర్భాన్ని బట్టి శత్రులవుతుంటారు.. పరిస్థితులను బట్టి మిత్రులుగా మారుతుంటారు. కొన్ని స్నేహాలు దశాబ్దాల పాటు కొనసాగుతుంటాయి. కానీ.. రాజకీయాల్లో ఈవేవీ ఉండవు. పొత్తుల వల్ల స్వలాభం చూసుకోవడమే తప్ప.. ఏమీ ఉండదు. అంతేకాకుండా పొత్తులతో అధికారంలోకి రావాలని చూస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పరిస్థితి ఒకవిధంగా అలానే ఉంది. ఎన్డీయే కూటమి నుంచి ఇప్పుడు ఒక్కో పార్టీ వీడిపోతోంది. కేంద్రం తెస్తున్న సంస్కరణలు, బిల్లులు నచ్చక ఒక్కొక్కరు బైబై చెబుతున్నారు. ఏడాది క్రితం శివసేన వెళ్లిపోగా.. ఈ […]

Written By: NARESH, Updated On : October 3, 2020 11:12 am
Follow us on

సందర్భాన్ని బట్టి శత్రులవుతుంటారు.. పరిస్థితులను బట్టి మిత్రులుగా మారుతుంటారు. కొన్ని స్నేహాలు దశాబ్దాల పాటు కొనసాగుతుంటాయి. కానీ.. రాజకీయాల్లో ఈవేవీ ఉండవు. పొత్తుల వల్ల స్వలాభం చూసుకోవడమే తప్ప.. ఏమీ ఉండదు. అంతేకాకుండా పొత్తులతో అధికారంలోకి రావాలని చూస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పరిస్థితి ఒకవిధంగా అలానే ఉంది. ఎన్డీయే కూటమి నుంచి ఇప్పుడు ఒక్కో పార్టీ వీడిపోతోంది. కేంద్రం తెస్తున్న సంస్కరణలు, బిల్లులు నచ్చక ఒక్కొక్కరు బైబై చెబుతున్నారు. ఏడాది క్రితం శివసేన వెళ్లిపోగా.. ఈ మధ్య అకాలిదళ్‌ వీడిపోయేందుకు డిసైడ్‌ అయింది.

Also Read: జాన్తానై.. మోడీ నిర్ణయాలు అనూహ్యం

బీజేపీ స్థాపించిన తొలినాళ్లలో ఏపార్టీ జత కట్టడానికి అంతగా ఆసక్తి చూపలేదు. హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న పార్టీ కావడంతో పెద్దగా పార్టీలు ముందుకు రాలేదు. అతివాద హిందుత్వ భావజాలం కలిగిన శివసేన, సిక్కుల మత పార్టీగా గుర్తింపు పొందిన అకాలిదళ్‌ మాత్రం బీజేపీతో కలిశాయి. ఆ తర్వాత బీజేపీ పెద్ద పార్టీగా అవతరించడంతో పరిస్థితులు మారాయి. ఫలితంగానే మహారాష్ట్రలో కూటమి నుంచి శివసేన బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది.

తాజాగా.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అకాలిదళ్‌కు చెందిన ఏకైక కేంద్ర మంత్రి హరసిమ్రత్ కౌర్ పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ వెనువెంటనే ఎలాంటి బుజ్జగింపులు లేకుండా ఆమోదించారు కూడా. 2019లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి కొద్ది రోజుల తరువాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలతో శివసేన దూరమయింది. ఏడాది తరువాత మరో చిరకాల మిత్రపక్షం అకాలిదళ్ కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

ఏడాదిలో పంజాబ్‌ ఎన్నికలు ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చి వ్యవసాయ బిల్లులపై ఆ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో తామూ వ్యతిరేకించకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన అకాలిదళ్‌ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో టాక్‌. పంజాబ్ రాజకీయాల్లో అకాలిదళ్‌కు మొదటినుంచీ బీజేపీ జూనియర్ భాగస్వామి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాతిపదికనే పోటీ చేస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటుకు బీజేపీ ససేమిరా అంటోంది. మొత్తం 117 సీట్లలో తమకు 59 ఇవ్వాలని, మిగిలిన 58 సీట్లలో అకాలీలు పోటీ చేయాలని రాష్ట్ర కమలం పార్టీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ బహిరంగంగానే కోరుతున్నారు. 2017 నాటి ఎన్నికల్లో కూటమికి 18 సీట్లు వచ్చాయి. వాటిలో 15 అకాలీలకు, మిగిలిన మూడు కమలానికి దక్కాయి. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 13 సీట్లకు చెరో రెండు గెలుచుకున్నాయి. ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఖాతాలో జమ కాగా, సంగ్రూర్ స్థానాన్ని ఆప్ పార్టీ కైవసం చేసుకుంది.

Also Read: సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి.. ఆయన ఎవరు? ఏం చేస్తారంటే?

ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ భాగస్వామిగా ఉండటానికి కమలనాథులు సుముఖంగా లేరనేది తెలుస్తోంది. అకాలీలతో మైత్రి కారణంగా హిందూ ఓట్లు కోల్పోతున్నామన్నది కమలం అభిప్రాయంలో ఉంది. గ్రామీణ ఓట్లు అకాలీలకు, పట్టణ, నగర ప్రాంత ఓట్లు బీజేపీకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో అకాలీల ప్రతిష్ఠ దెబ్బతిన్నది. పార్టీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ 90వ పడిలో ఉన్నారు. ఆయనకున్న పేరు ప్రతిష్ఠలు కుమారుడైన పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు లేవు. పార్టీలో కుటుంబ పాలనపై నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక.. ఇదే అదనుగా బీజేపీ పావులు కదుపుతోంది. అసమ్మతి అకాలిదళ్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. బిల్లులను నిరసిస్తూ అకాలిదళ్‌ వీడిపోవాలని చూస్తున్న.. బీజేపీ కూడా ఇదే మంచి ఛాన్స్‌ అన్నట్లు ఎదురుచూస్తోంది.పంజాబ్‌లో సొంతంగా పార్టీని పటిష్టం చేసి అధికారంలోకి రావాలని యోచిస్తోంది. ఇప్పటివరకు మిత్రులైన ఈ రెండు పార్టీలు.. వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేయనున్నారన్నమాట.